తెలంగాణలో మయోనైజ్ నిషేధం.. కారణం ఇదే.. 

సాక్షి లైఫ్ : తెలంగాణరాష్ట్రంలో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో పచ్చి గుడ్లను ఉపయోగించే మయోనైస్‌ను నిషేధించాలని నిర్ణయించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. తెలంగాణలో అక్టోబర్ 30 నుంచి తక్షణమే అమలులోకి వచ్చేలా ఒక సంవత్సరం పాటు పచ్చి గుడ్లను ఉపయోగించి తయారుచేసే మయోనైజ్ పై ఆహార భద్రత కమిషనర్  నిషేధించారు.

ప్రజారోగ్యం దృష్ట్యా పచ్చి గుడ్లతో తయారు చేసిన మయోనైజ్ ఉత్పత్తి, నిల్వ, అమ్మకం నిషేధించనున్నట్లు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ నోటిఫికేషన్‌లో తెలిపారు.ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యకలాపాల సమయంలో పరిశీలనలు ,తెలంగాణలోని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు గత కొన్ని నెలల్లో జరిగిన అనేక సంఘటనలలో ఫుడ్ పాయిజనింగ్‌కు గుడ్లతో తయారైన మయోనైజ్  కారణమని చెబుతున్నారు.

 మయోనైజ్..? 

 మయోనైజ్ అనేది ఒక మందపాటి, క్రీము సాస్, ఇది గుడ్డులోని పచ్చసొనను నూనెతో కలిపి, వెనిగర్ లేదా నిమ్మరసంతో తయారుచేస్తారు. ఇది రుచిగా ఉంటుంది. ఇది సాధారణంగా సైడ్ డిష్‌గా లేదా శాండ్‌విచ్‌లు, సలాడ్‌లు, స్నాక్స్, షావర్మా ,వివిధ వంటలలో ఉపయోగిస్తారు. 

ఇది కూడా చదవండి..ఫిష్ పెడిక్యూర్ సైడ్ ఎఫెక్ట్స్..

 

ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

 

ఆహార భద్రతా శాఖతో ఆరోగ్య మంత్రి దామోదర రాజ నరసింహ నిర్వహించిన సమీక్షా సమావేశంలో మయోనైజ్ నిషేధించాలని నిర్ణయం తీసుకున్నారు. తినుబండారాలు, రెస్టారెంట్లలో ఆహార నాణ్యతను నిర్ధారించడానికి తీసుకుంటున్న చర్యలలో భాగంగానే  అధికారులు మయోనైజ్ పై నిషేధం విధించాలని సిఫార్సు చేశారు.

ముఖ్యంగా చికెన్ వంటకాలను తిన్న తర్వాత వరుసగా ఫుడ్ పాయిజనింగ్ కేసుల నేపథ్యంలో కేరళ ఇప్పటికే మయోనైజ్ తయారీని నిషేధించిందని అధికారులు ఆరోగ్య మంత్రికి తెలిపారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలోనూ మయోనైజ్ ను బ్యాన్ చేస్తున్నట్లు ఇక్కడి అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. 

ఇది కూడా చదవండి..40 దాటాక పురుషుల్లో వచ్చే ఆరు వ్యాధులు..

ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు.. 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : unhealthy-foods food-safety harmful-food-combination mayonnaise-banned-in-telangana egg-mayonnaise-ban-in-telangana-state mayonnaise-ban-in-tg mayonnaise-banned telangana-food-safety-banned-mayonnaise telangana-ghmc-banned-egg-mayonnaise egg-mayonnaise-banned telangana-bans-mayonnaise telangana-govt-plans-to-ban-egg-mayonnaise ghmc-banned-egg-mayonnaise mayonnaise telangana-govt-considers-ban-on-egg-mayonnaise telangana-government-has-banned-mayonnaise food-safety-officers

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com