40 దాటాక పురుషుల్లో వచ్చే ఆరు వ్యాధులు..
సాక్షి లైఫ్ : 40 ఏళ్లు దాటాక వచ్చే ఆరోగ్య సమస్యలను నివారించేందుకు సరైన ఆహారం, వ్యాయామం, నిద్ర, మానసిక ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాదు ముందుగా వ్యాధులను గుర్తించడం ద్వారా సులువుగా ఆయా సమస్య నుంచి బయట పడొచ్చు. అంతేకాదు ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం కూడా చాలా ముఖ్యమని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
ముఖ్యంగా 40 ఏళ్ల తర్వాత, మహిళలైనా, పురుషులైనా తమ ఆరోగ్యంపై ఖచ్చితంగా శ్రద్ధ పెట్టాలి ఎందుకంటే..? నాలుగు పదుల వయస్సు తర్వాత సంభవించే అనేక మార్పులు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి అలాంటి అనారోగ్య సమస్యల బారీన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యనిపుణులు.
ప్రోస్టేట్ క్యాన్సర్ మరొక తీవ్రమైన సమస్య. ఇది పురుషులలో వచ్చే అత్యంత సాధారణ క్యాన్సర్లలో ఒకటి. ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ సాధారణంగా పెద్దగా లక్షణాలు కనిపించవు, నిర్దిష్ట యాంటిజెన్ (PSA) పరీక్షలు , డిజిటల్ మల పరీక్షలతో సహా రెగ్యులర్ స్క్రీనింగ్ ముందస్తుగా చేయిస్తూ ఉండాలి.
40 ఏళ్ల తర్వాత, పురుషులు సాధారణంగా కండర ద్రవ్యరాశి, ఎముక సాంద్రతను కోల్పోతూ ఉంటారు. ఈ పరిస్థితిని సార్కోపెనియా, ఆస్టియోపెనియా అని అంటారు. ఈ సమస్య ఎముకల బలహీనతకు దారితీస్తుంది. దీనిని ఎదుర్కోవడానికి, కండరాల బలాన్ని ,ఎముక సాంద్రతను పెంపొందించడానికి వ్యాయామాలు అవసరం.
పురుషుల విషయంలోనూ మహిళలల్లోలాగానే నలభై ఏళ్లు దాటిన తర్వాత అనేక మార్పులు జరుగుతాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. నాలుగుపదుల వయసు దాటాక ఆరోగ్యానికి తప్పనిసరిగా ప్రాధాన్యత ఇవ్వాలని, లేకపోతే 40 ఏళ్ల తర్వాత వచ్చే అన్ని హార్మోన్ల మార్పుల ప్రభావాల వల్ల అనేక రకాల శారీరక, మానసిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. డయాబెటీస్, బరువు పెరగడం వంటి సమస్యలు సహజంగానే తలెత్తే వకాశం ఉంటుంది.
ఇది కూడా చదవండి..ఆర్థరైటిస్ చికిత్సలో స్టెమ్ సెల్ థెరపీని ఉపయోగించడంలో ఎలాంటి సవాళ్లు ఉన్నాయి?..
ఇది కూడా చదవండి..జాక్‌ఫ్రూట్ రక్తంలో చక్కెర స్థాయిలను ఎలా ప్రభావితం చేస్తుంది..?
ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?
మానసిక సమస్యలు..
40 ఏళ్లు దాటిన తర్వాత కుటుంబ బాధ్యతలు, పిల్లలు చదువులకు సంబంధించి ఖర్చులు పెరుగుతాయి. దీని కారణంగా స్ట్రెస్ పెరుగుతుంది. తద్వారా అనేక మానసిక సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. అంతేకాదు శరీరంలో పోషకాలు తాగడం వల్ల కూడా పలు అనారోగ్య సమస్యల బారీన పడే అవకాశం ఉంది. హార్మోన్ల మార్పుల కారణంగా పురుషులు అనవసరమైన ఒత్తిడికి గురవుతారు. ఇది డిప్రెషన్,ఆందోళన వంటి మానసిక రుగ్మతలకు కూడా దారి తీస్తుంది. అందుకే అలాంటి సమస్యలు రాకుండా యోగా, మెడిటేషన్ తోపాటు ఇతర వ్యాయామాలు దినచర్యలో భాగం చేసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
ఎముకలకు సంబంధించిన సమస్యలు..
40 ఏళ్ల తర్వాత క్యాల్షియం, విటమిన్ డి తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల ఎముకలు బలహీనంగా మారతాయి. కాల్షియం తోపాటు ఇతర పోషకాలు కలిగిన ఆహారాన్ని తినడంతోపాటు, వ్యాయామాలు చేయడం ద్వారా ఆయా సమస్య నుంచి బయట పడొచ్చు.
హార్ట్ ప్రాబ్లమ్స్..
పురుషుల్లో హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ. కాబట్టి 40 ఏళ్లు దాటిన తర్వాత కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. పెరుగుతున్న వయసును దృష్టిలో ఉంచుకుని గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని వారు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి..పక్షవాతంలో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ఇది కూడా చదవండి..ఎక్కువసేపు స్క్రీన్ పై గడపడం వల్ల ఎలాంటి రోగాలు వస్తాయి..?
ఇది కూడా చదవండి..బరువు పెరగడానికి నిర్దిష్ట పండ్లు ఉన్నాయా..?
ఇది కూడా చదవండి..లిపోప్రోటీన్ గ్లోమెరులోపతి అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
