సాక్షి లైఫ్ : ఆరోగ్యానికి హాని కలిగించే పలురకాల ఔషధాల తయారీ, విక్రయం, పంపిణీని నిషేధిస్తూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. యాంటీబయాటిక్స్, పెయిన్‌కిల్లర్స్, మల్టీవిటమిన్‌లతో సహా 156 ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్‌డిసి) ఔషధాలను ప్రభుత్వం గురువారం నిషేధించింది. సమీక్షలో అవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని తేలింది. ఈ ఔషధాల తయారీ, విక్రయం, పంపిణీని నిషేధిస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చదవండి..ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఏమిటి.. ?
ఇది కూడా చదవండి..పచ్చబొట్టు తొలగింపు ప్రక్రియ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?
ఇది కూడా చదవండి..ఎం పాక్స్ : ఢిల్లీలోని ఆరు ఆసుపత్రులలో అందుబాటులో మంకీపాక్స్ చికిత్స..
ఇది కూడా చదవండి..చాందీపురా వైరస్ లక్షణాలను ఎలా గుర్తించాలి..?
నిషేధించిన ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్లలో యాంటీబయాటిక్స్, యాంటీ-అలెర్జిక్స్, పెయిన్ కిల్లర్స్, మల్టీవిటమిన్లు ,జ్వరం, హైపర్ టెన్షన్ కోసం కాంబినేషన్ డోస్‌లు ఉన్నాయి. డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు (డీటీఏబీ), కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది కేంద్ర ఆరోగ్య శాఖ.
ఈ జాబితాలోని ప్రధాన ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ ఔషధాలలో మెఫెనామిక్ యాసిడ్, పారాసెటమాల్ ఇంజెక్షన్ కాంబినేషన్ ఉన్నాయి, ఇది వివిధ పరిస్థితులలో నొప్పి ,వాపును తగ్గించడానికి ఉపయోగిస్తారు. కడుపు నొప్పికి చికిత్స చేయడానికి ఉపయోగించే ఒమెప్రజోల్ మెగ్నీషియం, డైసైక్లోమైన్ హెచ్‌సిఎల్ కలయిక మోతాదు.
ఎఫ్‌డిసిల వాడకం మనుషుల ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది, అయితే ఈ ఔషధాలన్నిటికి సురక్షితమైన ప్రత్యామ్నాయ మందులు అందుబాటులో ఉన్నాయి. రోగికి ప్రయోజనం కంటే హాని ఎక్కువ అని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు" గెజిట్ నోటిఫికేషన్ పేర్కొంది కేంద్రం. "కాబట్టి పెద్ద ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940లోని సెక్షన్ 26A ప్రకారం ఈ ఎఫ్ డిసి తయారీ, అమ్మకం లేదా పంపిణీని నిషేధించడం అవసరం" అని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..ఆఫ్రికాలో వేగంగా విస్తరిస్తున్న మంకీపాక్స్..
ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com