ఉగాండాలో విజృంభిస్తున్న కొత్తవ్యాధి డింగా డింగా..
సాక్షి లైఫ్ : ఆఫ్రికాలోని ఉగాండాలో కొత్త “మిస్టరీ డిసీజ్ ” అక్కడి ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందడంతో వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఇప్పటికే దేశంలో సుమారు 300 మంది దీని బారిన పడ్డారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఉగాండా దేశంలోని బుండిబుగ్యో జిల్లాలోని స్థానికులు ఈ మిస్టరీ డిసీజ్ కు “డింగా డింగా” అని పేరు పెట్టారు. ఇది ప్రధానంగా మహిళలు, బాలికలను ఎక్కువగా ప్రభావితం చేస్తోంది.
"డింగా డింగా" లక్షణాలలో జ్వరం, శరీరంలో వణుకు వంటివి ఉన్నాయి, దీనికారణంగా ఈ వ్యాధి వచ్చిన వారు నడవడం కూడా చాలా కష్టంగా మారుతుందని వైద్యులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..
ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?
ప్రస్తుతం ఈ వ్యాధి సోకిన వారికి యాంటీబయాటిక్స్ ద్వారా చికిత్స చేస్తున్నారు. ఇప్పటివరకు "డింగా డింగా" వచ్చిన వారిలో ఎటువంటి మరణాలు సంభవించలేదని బుండిబుగ్యోజిల్లా ఆరోగ్యశాఖ అధికారి డా. కియితా క్రిస్టోఫర్ చెప్పారు.
తాము నిర్దిష్ట చికిత్సలను ఉపయోగిస్తున్నామని, రోగులు సాధారణంగా ఒక వారంలోపు కోలుకుంటారని. "జిల్లాలోని ఆరోగ్య కేంద్రాలలో చికిత్స పొందాలని స్థానికులను ఆయన కోరారు. బుండిబుగ్యో ప్రాంతంలోని సమీప ప్రాంతాలలో ఎటువంటి కేసులు నమోదు కాలేదని వైద్యులు గుర్తించారు. విశ్లేషణ కోసం నమూనాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సమర్పించినట్లు, ఈ వ్యాధి గురించి దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదని ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు.
ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు..
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
