NMHS-2 : దేశవ్యాప్తంగా జాతీయ మానసిక ఆరోగ్య సర్వేకు రంగం సిద్ధం..!

షేర్ చేయండి:
NMHS-2 : దేశవ్యాప్తంగా జాతీయ మానసిక ఆరోగ్య సర్వేకు రంగం సిద్ధం..!

సాక్షి లైఫ్ : ప్రతి వందమందిలో 11 మందికి పైగా ఏదో ఒక మానసిక సమస్యతో సతమతమవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు వంటి సమస్యలు మనిషిని లోలోపలే దహించివేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజల మానసిక ఆరోగ్య స్థితిగతులను అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం 'జాతీయ మానసిక ఆరోగ్య సర్వే-2' (NMHS-2)ను ప్రారంభించింది.

ఇది కూడా చదవండి..ఒక వ్యక్తికి రోజుకి ఎన్ని కేలరీస్ అవసరం..? 

ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..? 

ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?

 

తొమ్మిదేళ్ల తర్వాత భారీ కసరత్తు.. 

2015-16లో తొలిసారిగా 12 రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వే తర్వాత, ఇప్పుడు సుమారు తొమ్మిదేళ్ల విరామం అనంతరం ఈ రెండో దశ సర్వేను చేపడుతున్నారు. గతంలో పరిమిత రాష్ట్రాలకే పరిమితమైన ఈ ప్రక్రియ, ఈసారి దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తృతంగా జరగనుంది. బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (NIMHANS) ఈ సర్వేకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది.

సర్వేలో కీలకాంశాలు.. 

  13-17 ఏళ్ల లోపు కౌమార దశ పిల్లలతో పాటు, 18 ఏళ్లు పైబడిన పెద్దలందరినీ ఈ సర్వే పరిధిలోకి తెచ్చారు. కేవలం మానసిక రుగ్మతలే కాకుండా, కోవిడ్-19 తర్వాత మారిన పరిస్థితులు, వాతావరణ మార్పులు వల్ల కలిగే మానసిక ఒత్తిడి, ఇంటర్నెట్-గేమింగ్ అడిక్షన్ వంటి ఆధునిక సమస్యలపై కూడా దృష్టి సారించనున్నారు. వలస కూలీలు, గిరిజన ప్రాంతాల ప్రజలు, వృద్ధులు, మహిళల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక అధ్యయనం చేయనున్నారు.

"మారుతున్న జీవనశైలి, పెరిగిన సాంకేతికత వాడకం వల్ల యువతలో మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. ఈ సర్వే ద్వారా వచ్చే గణాంకాలు భవిష్యత్తులో మెరుగైన వైద్య సదుపాయాల కల్పనకు, ప్రభుత్వ విధానాల రూపకల్పనకు దిక్సూచిగా మారనున్నాయని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. 

చికిత్సలో.. 

తొలి సర్వే ప్రకారం మనదేశంలో సుమారు 15 కోట్ల మందికి మానసిక వైద్యం అవసరం కాగా, అందులో కేవలం 3 కోట్ల మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. అంటే దాదాపు 80శాతం మంది సరైన వైద్యానికి దూరంగా ఉంటున్నారు. అవగాహన లోపం, సామాజిక వివక్ష (Stigma) వంటి కారణాలే దీనికి ప్రధాన అడ్డంకులుగా మారుతున్నాయి. ప్రస్తుత సర్వే ద్వారా ప్రతి రాష్ట్రంలో కనీసం 5 జిల్లాలను ఎంపిక చేసి, క్షేత్రస్థాయిలో వివరాలను సేకరించనున్నారు.

 

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.