హెచ్‌ఎంపీవీ గురించి భయపడాల్సిన అవసరం లేదు : ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ..

షేర్ చేయండి:
హెచ్‌ఎంపీవీ గురించి భయపడాల్సిన అవసరం లేదు : ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ..

సాక్షి లైఫ్ : హ్యూమన్ మెటానిమోవైరస్(హెచ్‌ఎంపీవీ) గురించి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. హెచ్‌ఎంపీవీ వైరస్ గురించి సోషల్ మీడియాలో జనాలను భయపెట్టే వార్తలను, ఆధారాలు లేని వార్తలను ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. చైనా దేశంలో ఈ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నా, ఈ వైరస్ విషయంలో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.

"2001లోనే ఈ వైరస్ తొలిసారి కనుగొనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడొక చోట వ్యాప్తి చెందుతూనే ఉందని, ఇది శ్వాసకోశ వ్యవస్థపై స్వల్ప ప్రభావం చూపుతుంది" అని ఆయన వివరించారు.

ఇది కూడా చదవండి.. హెచ్ఎంపివి వ్యాప్తితో అప్రమత్తమైన భారత్.. 

ఇది కూడా చదవండి.. డెలివరీకి ముందు గర్భిణీలు "సీ" ఫుడ్ తినకూడదా..? 

ఇది కూడా చదవండి.. అధిక రక్తపోటు లక్షణాలు..? 

ఇది కూడా చదవండి.. మందులు లేకుండా అధిక రక్తపోటును నియంత్రించే మార్గాలు

ముఖ్యంగా, ఈ వైరస్ వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు అతని నోటి నుంచి వచ్చే తుంపర్ల ద్వారా మరొకరికి వ్యాపిస్తుందని, "ప్రస్తుతానికి హెచ్‌ఎంపీవీ వైరస్ విషయంలో ప్రజలు భయపడాల్సిన  అవసరం లేదు. జాగ్రత్తగా ఉంటే ఈ వైరస్ ను నియంత్రించవచ్చు" అని మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు.

 

ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..  

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

  ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.