డెలివరీకి ముందు గర్భిణీలు "సీ" ఫుడ్ తినకూడదా..? 

షేర్ చేయండి:
డెలివరీకి ముందు గర్భిణీలు "సీ" ఫుడ్ తినకూడదా..? 

సాక్షి లైఫ్ : ప్రెగ్నెన్సీ కేర్ టిప్స్ : డెలివరీలో ఎలాంటి సమస్య రాకుండా ఉండాలంటే, గర్భం దాల్చిన చివరి నెలల్లో కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. గర్భిణీలు తప్పనిసరిగా వారి ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ చివరి నెలల్లో ఏయే విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి..? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి..? ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

ఇది కూడా చదవండి.. చాందీపురా వైరస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు అవసరం..? 

 

ఇది కూడా చదవండి..రోజుకి ఎంత చక్కర తింటే..మధుమేహం రాదు..?

గర్భం చివరి నెలల్లో ఆహారం ఎలా ఉండాలి..?

ఈ చిట్కాలు డెలివరీలో సమస్యల నుంచి రక్షిస్తాయి. అంతేకాదు గర్భధారణ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని అనుసరించడం చాలా ముఖ్యం. సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. నెలలు నిండిన తర్వాత పలు జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చని, ముఖ్యంగా డెలివరీ సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్త పడొచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు.  
 
తల్లి, బిడ్డకు.. 

గర్భం దాల్చిన ప్రతి నెల ప్రత్యేకమైనదే. కాదు సున్నితమైనది కూడా. కొన్నిజాగ్రత్తలు పాటించడం ద్వారా అనేక సమస్యలను తగ్గించ గలిగినప్పటికీ, చిన్నపాటి అజాగ్రత్త తల్లి ,బిడ్డ ఇద్దరికీ ప్రమాదకరంగా మారవచ్చని డాక్టర్లు వెల్లడిస్తున్నారు.  

9వ నెలలో ఆహారం ఎలా ఉండాలి..?

ప్రెగ్నెన్సీ సమయంలో కొన్నిసార్లు స్వీట్లు తినాలని, కొన్నిసార్లు స్పైసీ ఫుడ్ తినాలని అనిపిస్తుంది. నాన్ వెజ్ ఫుడ్ తినాలని అనిపిస్తే, చికెన్ , మటన్ ఫర్వాలేదు. కానీ ఈ సమయంలో సీ ఫుడ్ తినడం మానుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఎందుకంటే సీ ఫుడ్‌లో ఒమేగా 3 ఎక్కువ మొత్తంలో ఉంటుంది. నెలలు నిండే కొద్దీ ఒమేగా -3 జీర్ణం అవ్వడంలో ఇబ్బంది ఉండవచ్చు. ఇది కొంతమందిలో అజీర్ణ సమస్యను పెంచవచ్చు. కాబట్టి ఈజీగా అరిగే ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం అని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. 

ఇది కూడా చదవండి.. చాందీపురా వైరస్‌ చిన్నారులకే ఎందుకొస్తుంది..? 

ఇది కూడా చదవండి.. చాందీపురా వైరస్‌ లక్షణాలు ఎలా ఉంటాయి..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.