దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య.. ఏడుగురు మృతి
సాక్షి లైఫ్ : కరోనావైరస్ కేసులు భారతదేశంలో మళ్ళీ పెరుగుతున్నాయి. గత వారంలో (మే 25తో ముగిసిన వారంలో) కేసుల సంఖ్య ఐదు రెట్లు పెరిగి 1,000 మార్కును దాటింది. తాజాగా, దేశవ్యాప్తంగా క్రియాశీలక కోవిడ్-19 కేసులు 2,710కి చేరాయి. గత వారం కంటే 1,000కి పైగా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ప్రధాన రాష్ట్రాల్లో..
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, కేరళలో అత్యధికంగా 1,147 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (424), ఢిల్లీ (294), గుజరాత్ (223) ఉన్నాయి. కర్ణాటక, తమిళనాడులలో చెరో 148 కేసులు నమోదు కాగా, పశ్చిమ బెంగాల్‌లో 116 కేసులు వెలుగుచూశాయి. మిజోరంలో కూడా ఏడు నెలల తర్వాత రెండు కోవిడ్ కేసులు నమోదవడం విశేషం.
మృతుల సంఖ్య..?
గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా ఏడుగురు మరణించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఈ సంవత్సరం మొదటి ఐదు నెలల్లో కోవిడ్ సంబంధిత మరణాల సంఖ్య 22కి చేరింది. మరణించిన ఏడుగురిలో మహారాష్ట్రలో ఇద్దరు కాగా, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, పంజాబ్, తమిళనాడులలో ఒక్కొక్కరు ఉన్నారు.
అయితే, చాలావరకు నమోదైన కోవిడ్ కేసులు తేలికపాటి లక్షణాలతో ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కేరళలో ఎక్కువ కేసులు నమోదవడం ఆ రాష్ట్రంలో ఎక్కువ పరీక్షలు నిర్వహించడం వల్లే కావచ్చని కూడా వైద్యాధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్ కౌంట్ ను ఎలా పెంచుకోవచ్చు..?
ఇది కూడా చదవండి..థ్రోంబోసైట్లు అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
