నేడు వరల్డ్ ఆటిజం అవేర్ నెస్ డే సందర్భంగా.. స్పెషల్ స్టోరీ..  

షేర్ చేయండి:
నేడు వరల్డ్ ఆటిజం అవేర్ నెస్ డే సందర్భంగా.. స్పెషల్ స్టోరీ..  

సాక్షి లైఫ్ : ప్రపంచ ఆటిజం అవేర్‌నెస్ డే అనేది ఆటిస్టిక్ వ్యక్తులు సాధారణ జీవితాన్ని గడపడానికి ,వారికి సహాయం చేయడానికి జరుపుకుంటారు. ఆటిజంను ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అని కూడా పిలుస్తారు. ఈ సమస్య  మెదడు అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. ఇది ప్రవర్తన, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, పరస్పర నైపుణ్యాలు,అభ్యాస సామర్థ్యాన్ని ప్రభావితం చేసే సంక్లిష్టమైన పరిస్థితి. 

 ఇది కూడా చదవండి.. ఒక వారంలో ఎన్ని గంట‌లు వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి మంచిది..? 


 ఆటిజం అవేర్‌నెస్ డే థీమ్.. 

ఈ సంవత్సరం ప్రపంచ ఆటిజం అవేర్‌నెస్ డే థీమ్ 'ఆటిజంతో బాధపడే పిల్లల్ని మామూలు జీవితంలోకి తీసుకురావడం',  ఈ రుగ్మతతో బాధపడుతున్న వ్యక్తుల గొంతులను బలోపేతం చేయడం, తద్వారా సమాజంలో అలాంటి వ్యక్తుల ఆదరణ పెరుగుతుంది. వారు కూడా మంచి జీవితం, మెరుగైన జీవితం వైపు పయనించాలనేది ప్రధాన ఉద్దేశ్యం. నీలం రంగు ఆటిజం చిహ్నంగా పరిగణిస్తారు. దీని కారణంగా ప్రతి సంవత్సరం ఈ రోజున ప్రధాన చారిత్రక భవనాలు నీలిరంగు దీపాలతో అలంకరిస్తారు.

అవగాహన కల్పించడమే దీని ఉద్దేశం.. 

ప్రతి సంవత్సరం, ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 2వతేదీని ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సమస్యపై ప్రజలకు అవగాహన కల్పించడమే దీని ఉద్దేశం. ఆటిస్టిక్ పిల్లలు సాధారణ పిల్లల కంటే కొంచెం భిన్నంగా ఉంటారు. కాబట్టి వారితో వ్యవహరించే విధానం కూడా భిన్నంగా ఉంటుంది. 2008లో మొదటిసారిగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంది.

ఇది కూడా చదవండి.. ఎక్కిళ్లు రావడానికి కారణాలు..? నివారణా చిట్కాలు..   

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.