దేశంలో కొనసాగుతున్న చాందీపురా వైరస్ వ్యాప్తి..
సాక్షి లైఫ్ : దేశంలో చాందీపురా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. భారతదేశంలో 53 కేసులు నమోదుకాగా, గుజరాత్ లోనే 51 కేసులు నమోదయ్యాయి. ఎన్‌సిడిసి అండ్ నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బోర్న్ డిసీజెస్ కంట్రోల్ (ఎన్‌సివిబిడిసి) సంయుక్త సలహాలు జారీ చేసినట్లు ఆరోగ్య మంత్రి తెలియజేశారు. చాందీపురా వైరస్ సోకిన 53 కేసుల్లో గుజరాత్‌లో 51, రాజస్థాన్‌లో రెండు కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా మంగళవారం రాజ్యసభకు తెలిపారు.
ఇది కూడా చదవండి..హైపర్పిగ్మెంటేషన్‌ను ఎలా పరిష్కరించవచ్చు?
ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్‌ను పెంచే ఆహారపదార్థాల గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి..అధిక రక్త పోటును నియంత్రించే ఆహారాలు..
19 మంది మరణించగా..
ఈ 53 చాందీపురా వైరస్ కేసులలో 19 మంది మరణించగా, చనిపోయిన వారంతా గుజరాత్ కు చెందినవారే. గుజరాత్ ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం పాజిటివ్ చాందీపురా వైరస్ కేసుల సంఖ్య 59కి పెరిగింది. వైరల్ ఎన్సెఫాలిటిస్ కేసుల సంఖ్య 159కి చేరుకుంది. 71 మంది మరణించారు. వ్యాధిని నిరోధించడానికి అవసరమైన చర్యలను చేపట్టడానికి, వ్యాప్తిపై మరింతగా ఎపిడెమియోలాజికల్ పరిశోధన కోసం గుజరాత్ ప్రభుత్వానికి సహాయం చేయడానికి నేషనల్ జాయింట్ అవుట్‌బ్రేక్ రెస్పాన్స్ టీమ్ (ఎన్ జెఓ ఆర్టీ)ని నియమించినట్లు కూడా నడ్డా చెప్పారు.
ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణే నిపుణులు ఎన్ జెఓ ఆర్టీ లో భాగమని నడ్డా వెల్లడించారు.
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
