అధిక రక్త పోటును నియంత్రించే ఆహారాలు..  

షేర్ చేయండి:
అధిక రక్త పోటును నియంత్రించే ఆహారాలు..  

సాక్షి లైఫ్ : నేడు చాలా మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. షుగర్ లేదా కొలెస్ట్రాల్ ఉంటే వాటిని ఎలా నియంత్రించాలో చాలా మందికి తెలుసు. వీటి విషయంలో చేయాల్సిందల్లా ఆహారాన్ని పరిమితం చేయడం. కానీ రక్తపోటు విషయంలో అలా కాదు, రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవాలో కూడా చాలా మందికి తెలియదు. ఏయే ఆహారాలు బీపీని అదుపులో ఉంచుతాయో తెలుసుకుందాం..

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..? 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..  

కాఫీ..

కాఫీలో ఉండే కెఫీన్ రక్తపోటును పెంచుతుంది. కానీ దాని ప్రభావం సాధారణంగా స్వల్పకాలికంగా ఉంటుంది. మితంగా తీసుకోవడం ద్వారా పెద్దగా ఇబ్బంది ఉండదు. ఎక్కువగా కాఫీ తాగడం వల్ల కెఫిన్ శాతం పెరిగి రక్తపోటును ప్రభావితం చేస్తుంది.

పుల్లని పండ్లు.. 

రక్తపోటును నియంత్రించడంలో విటమిన్ "సి"ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి, మీ ఆహారంలో విటమిన్ సి పుష్కలంగా ఉండే నారింజ, ద్రాక్ష, నిమ్మకాయలను చేర్చండి. ఇలా చేయడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది

వెల్లుల్లి.. 

అధిక రక్తపోటు ఉన్నవారికి వెల్లుల్లి చాలా మంచిది. ఇది రక్తపోటును తగ్గించడానికి, నియంత్రించడానికి సహాయపడుతుంది. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచడంలో మంచి పనితీరును కనబరుస్తుంది. 

ఫిష్.. 

ఫిష్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో ఉపయోగపడుతాయి.  

దానిమ్మ.. 

రక్తపోటును నియంత్రించడంలో దానిమ్మలో ఉండే పోషక గుణాలు చాలా ముఖ్యమైనవి. అంతేకాదు ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా రక్తపోటును అదుపులో ఉంచుతాయి. 

ఓట్స్.. 

ఓట్స్ ఫైబర్ అధికంగా ఉండే ఆహారం. దీన్ని ఆహారంలో చేర్చుకుంటే రక్తపోటు, కొలెస్ట్రాల్ అదుపులో ఉంటాయి.

బీట్ రూట్.. 

బీట్‌రూట్తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. బీట్‌రూట్‌లో నైట్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించి ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఇది కూడా చదవండి..బేబీ వాకర్స్ తో పిల్లలు వేగంగా నడవగలుగుతారా..?

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.