చెడు కొలెస్ట్రాల్‌ను పెంచే ఆహారపదార్థాల గురించి తెలుసా..?
సాక్షి లైఫ్ : కొలెస్ట్రాల్ చాలా మంది ప్రజలు కష్టపడే విషయం. కొలెస్ట్రాల్ ఉందని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ చేసే మొదటి పని తీసుకునే ఆహారంలో మార్పులు, చేర్పులు చేసుకోవడం. ఇందుకోసం కొత్త డైట్ ప్రారంభించేటప్పుడు.. కొలెస్ట్రాల్ ను పెంచే ఆహారాలను అస్సలు తీసుకోకూడదు. కొలెస్ట్రాల్‌ను పెంచే కొన్ని ఆహారాలు ఏమేం ఉన్నాయో తప్పనిసరిగా తెలుసుకోవాలి.
ఇది కూడా చదవండి..కంటి సమస్యలకు ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స చేస్తారు..?
ఇది కూడా చదవండి.. వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే ఎలా మొదలైంది..?
ఇది కూడా చదవండి.. వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
మాంసం..
గొడ్డు మాంసం, పంది మాంసం, మటన్ వంటి రెడ్ మీట్‌లలో సంతృప్త కొవ్వు అధికంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటివి అధిక కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. ఈ ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
ప్రాసెస్ చేసిన ఆహారాలు..
వీటిలో ఉండే సోడియం, సంతృప్త కొవ్వు కొలెస్ట్రాల్‌ను మరింతగా పెంచుతాయి. కాబట్టి బర్గర్స్, ఫ్రెస్పో ఫుడ్స్ అస్సలు ఆరోగ్యకరం కాదు. కనుక కొలెస్ట్రాల్ పెరిగినవారు ఇలాంటి ఆహార పదార్థాలు దూరంగా ఉండడం ఉత్తమం.
నూనెలో వేయించిన ఆహారాలు..
ప్రాసెస్డ్ ఫుడ్స్ లాగా, నూనెలో వేయించిన ఆహారాలలో సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇవి కొలెస్ట్రాల్‌ను మరింతగా పెంచుతాయి. దీని కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.
వెన్న- చీజ్..
వెన్, చీజ్ కొవ్వు , సోడియం అధికంగా ఉండే ఆహారాలు. ఇవి అధికంగా తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. వీటిని ఆహారంలో రోజూ తీసుకునేవాళ్లు కొద్దిగా తగ్గించుకోవడం మంచిది.
కుక్కీలు..
కాల్చిన కుకీలు, కేకులు, పేస్ట్రీలు మొదలైనవి చాలా అనారోగ్యకరమైన ఆహారాలు. వీటి ద్వారా, కొవ్వు , కొలెస్ట్రాల్ పెరుగుతుంది
చక్కెర ఉత్పత్తులు..
చక్కెర అధికంగా ఉండే ఆహారాలు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. జిలేబీ, గులాబ్ జామ్, పెప్సీ వంటివాటిని ఆహారంలో మానుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.
ఇది కూడా చదవండి..30కి పైగా వ్యాధికారక క్రిముల జాబితాను విడుదల చేసిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్..
ఇది కూడా చదవండి..మలప్పురంలోని పాండిక్కాడ్ నుంచి సేకరించిన గబ్బిలాల నమూనాల్లో నిఫా వైరస్ యాంటీబాడీస్..
ఇది కూడా చదవండి..పొద్దున్నే నిద్ర లేవగానే అలసటగా అనిపిస్తుందా..? కారణాలు ఇవే కావచ్చు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
