Organ Transplantation : తెలంగాణ స్టేట్ లో ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం ఎదురు చూస్తున్న 5వేల మంది..!

షేర్ చేయండి:
Organ Transplantation : తెలంగాణ స్టేట్ లో ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం ఎదురు చూస్తున్న 5వేల మంది..!

సాక్షి లైఫ్ : వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య మరింతగా పెరుగుతోంది. శరీరంలో ఏదో ఒక అవయవం దెబ్బతిని, మృత్యువుతో పోరాడుతున్న వేలాది మంది రోగులకు ‘అవయవ దానం’ తప్ప మరొక అవకాశం లేదు. అయితే, తెలంగాణలో అవయవాల కోసం నిరీక్షిస్తున్న వారి సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 4,800 మందికి పైగా  రోగులు జీవన్‌దాన్ పథకం ద్వారా వివిధ అవయవాల కోసం దరఖాస్తు చేసుకుఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 

నమోదు చేసుకోవడంలో వెనుక..

 గత ఏడాది (2025)లో 201 మంది దాతల నుంచి అవయవాలను సేకరించగా, మొత్తం 732 మందికి శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఇందులో అత్యధికంగా కిడ్నీ మార్పిడిలు (287) జరగగా, ఆ తర్వాతి స్థానాల్లో కాలేయం (183), కళ్లు (140), గుండె మార్పిడి (30) ఉన్నాయి. దాతల్లో అత్యధికులు 41-50 ఏళ్ల మధ్య వయస్సు వారే ఉన్నారు.

సమస్య ఎక్కడ అంటే..? 

అవయవాల కొరతకు ప్రధాన కారణం బ్రెయిన్ డెత్ కేసులను గుర్తించడంలో విఫలమవ్వడమేనని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కార్పొరేట్ ఆసుపత్రుల్లో బ్రెయిన్ డెత్ ప్రకటించేందుకు యాజమాన్యాలు వెనుకాడటం, శిక్షణ పొందిన సిబ్బంది కొరత, న్యాయపరమైన చిక్కుల భయం వంటివి అడ్డంకిగా మారాయి. 100 పడకలు అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ప్రతి ఆసుపత్రిలో, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తప్పనిసరిగా 'అవయవ సేకరణ కేంద్రాల'ను ఏర్పాటు చేయాలని నిబంధనలు ఉన్నా, అవి పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు.

 రోగుల బంధువులకు అవయవ దానంపై అవగాహన కల్పించడంలో ఆసుపత్రి సిబ్బంది విఫలమవుతున్నారు. ఒకరి అవయవ దానం ద్వారా ఎనిమిది మందికి పునర్జన్మ ప్రసాదించవచ్చనే విషయాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.

 ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆసుపత్రులు పారదర్శకంగా వ్యవహరిస్తే రెండేళ్లలోనే వెయిటింగ్ లిస్ట్‌ను భారీగా తగ్గించవచ్చు. పాఠశాలలు, కళాశాలలు, స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి అని హెల్త్‌కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొంటున్నారు.

 

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.