Poison Found in Cough Syrup: కాఫ్ సిరప్ లో 'పాయిజన్'.. హిమాచల్‌లో సేల్స్ బ్యాన్..
సాక్షి లైఫ్ : హిమాచల్ ప్రదేశ్ ఫార్మా రంగంలో నాణ్యతా లోపాలు మరోసారి కలకలం రేపుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో తయారవుతున్న పలు ఔషధాలు, ముఖ్యంగా కొన్ని రకాల దగ్గు మందులు 'ప్రమాణాలకు అనుగుణంగా లేవని' (Not of Standard Quality) తేలడంతో ప్రభుత్వం వాటిపై తక్షణమే నిషేధం విధించింది. మార్కెట్లో ఉన్న స్టాక్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని (Recall) తయారీ సంస్థలను ఆదేశించింది.
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
ఇది కూడా చదవండి..Prediabetes : ప్రీడయాబెటిస్ కు గుండె జబ్బుల ప్రమాదానికి లింక్ ఏంటి..?
ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..
ప్రాణాలు తీస్తున్న 'కల్తీ' మందులు..
ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో 'కోల్‌డ్రిఫ్' (Coldrif) అనే దగ్గు మందు వాడి సుమారు 20 మందికి పైగా చిన్నారులు మృత్యువాత పడటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సిరప్‌లో 'డైథిలిన్ గ్లైకాల్' (DEG) అనే విషపూరిత రసాయనం కలిసినట్లు కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ (CDSCO) గుర్తించింది. ఇది శరీరంలోకి చేరితే కిడ్నీలు విఫలమై ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. దీంతో అప్రమత్తమైన హిమాచల్ డ్రగ్ కంట్రోలర్ మనీష్ కపూర్, రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులు, మెడికల్ షాపులు ఈ మందును విక్రయించకూడదని కఠిన ఆదేశాలు జారీ చేశారు.
హిమాచల్‌లో భారీగా విఫలమైన నమూనాలు..
కేవలం దగ్గు మందులే కాకుండా, రాష్ట్రంలోని సోలన్, సిర్మౌర్ జిల్లాల్లో తయారవుతున్న ఇతర ఔషధాల్లోనూ లోపాలు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా సేకరించిన శాంపిల్స్‌లో హిమాచల్‌కు చెందిన సుమారు 49 ఔషధాలు నాణ్యత పరీక్షల్లో విఫలమయ్యాయి. ఇందులో జ్వరం పారాసెటమాల్, గుండె జబ్బులు, మధుమేహం, ఫిట్స్ (ఎపిలెప్సీ) కి సంబంధించిన కీలక మందులు కూడా ఉండటం గమనార్హం.
రెండేళ్ల లోపు చిన్నారులకు..
నాణ్యత పాటించని కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని, పదే పదే తప్పులు చేసే సంస్థలను 'బ్లాక్ లిస్ట్'లో పెడతామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హెచ్చరించారు. రెండేళ్ల లోపు చిన్నారులకు వైద్యుల సలహా లేకుండా ఎలాంటి దగ్గు లేదా జలుబు సిరప్‌లు వాడకూడదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. నాణ్యత లేని బ్యాచ్ నంబర్ల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవాలని చిన్నారుల తల్లిదండ్రులకు సూచించింది.
ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
