Reused oil : రీయుజ్డ్ ఆయిల్ వినియోగంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఎఫ్ఎస్ఎస్ఏఐలకు ఎన్ హెచ్ఆర్ సి నోటీసులు..
సాక్షి లైఫ్ : వంట నూనెను పదే పదే వేడిచేసి, పునర్వినియోగం చేయడం (Reuse of Cooking Oil) దేశవ్యాప్తంగా విచ్చలవిడిగా జరుగుతుండటంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రమాదకర ధోరణి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని పేర్కొంటూ... కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI)కు నోటీసులు జారీ చేసింది.
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
ముఖ్యంగా వీధి వ్యాపారులు, చిన్న హోటళ్లు, రెస్టారెంట్లు ఒకసారి డీప్ ఫ్రై (Deep Fry) చేసిన వంట నూనెను మళ్లీ మళ్లీ వేడిచేసి వాడుతున్నారు. ఈ అలవాటు ప్రజల ఆరోగ్యానికి పెనుముప్పుగా మారుతోందనే నివేదికలపై NHRC స్పందించింది.
నిబంధనల ఉల్లంఘన(Violation of rules)..
వాడిన నూనెను పునర్వినియోగం చేయకుండా నియంత్రించడానికి FSSAI కఠినమైన నిబంధనలను రూపొందించినప్పటికీ, వాటిని పెద్ద ఎత్తున ఉల్లంఘిస్తున్నారని కమిషన్ గుర్తించింది.
ప్రమాదకర రసాయనాలు (Hazardous chemicals)..
వంట నూనెను పదే పదే అధిక ఉష్ణోగ్రతలకు వేడిచేసినప్పుడు, అందులో టోటల్ పోలార్ కాంపౌండ్స్ (TPC) అనే హానికర రసాయనాలు ఏర్పడతాయి. ఈ TPC స్థాయిలు 25శాతం దాటితే ఆ నూనెను మానవ వినియోగానికి పనికిరానిదిగా FSSAI ప్రకటించింది.
పదే పదే వాడిన నూనెలో తయారైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్, హైపర్‌టెన్షన్ (అధిక రక్తపోటు), అల్జీమర్స్ వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాడిన నూనెలో పెరిగే ట్రాన్స్ ఫ్యాట్స్ గుండె ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.
కమిషన్ ఆదేశాలు..
ప్రజారోగ్యానికి సంబంధించిన ఈ కీలక అంశంపై తీసుకున్న చర్యలు, నిబంధనల అమలు, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు ఏ మేరకు చేపట్టారో నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని NHRC.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ FSSAIలను ఆదేశించింది. ఇళ్లల్లో కూడా డీప్ ఫ్రై చేసిన నూనెను మళ్లీ మళ్లీ వాడటం మానుకోవాలని, వాడిన నూనె పారబోయడానికి ప్రత్యేక పద్ధతులు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..?
ఇది కూడా చదవండి..సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
