Caffeine Craze : యువతలో పెరుగుతున్న 'కెఫీన్' క్రేజ్.. గుండె, నిద్రపై పెను ప్రభావం..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగడం(Drinking tea or coffee), పని ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం రోజుకు రెండు మూడు కప్పులు తీసుకోవడం సర్వసాధారణం. అయితే ప్రస్తుత తరం యువతలో (Gen Z) టీ, కాఫీలతో పాటు ఎనర్జీ డ్రింక్స్, కార్బొనేటెడ్ పానీయాల వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. అలసటను తగ్గించి, మెదడును చురుగ్గా ఉంచేందుకు కెఫీన్ తాత్కాలికంగా తోడ్పడినప్పటికీ.. మోతాదు మించితే తీవ్ర ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..Sippers and Tumblers : సిప్పర్లు, టంబ్లర్లలో నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఎనర్జీ డ్రింక్స్‌ (Energy Drinks)తో ముప్పు రెట్టింపు..

సమస్య కేవలం టీ, కాఫీలతోనే ఆగడం లేదు.యువత ఎనర్జీ డ్రింక్స్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతుండటమే ప్రధాన ఆందోళన. వీటిలో కెఫీన్‌తో పాటు కృత్రిమ చక్కెర్లు (sugar), ఇతర ఉద్దీపన పదార్థాలు (Stimulants) అధిక మోతాదులో ఉంటాయి. ఇవి శరీరంలో చేరిన వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలను, రక్తపోటును ఒక్కసారిగా పెంచే ప్రమాదం ఉంది. సులభంగా అలసట తీరుతుందని రోజూ ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం వల్ల శరీర జీవక్రియలపై తీవ్ర ప్రభావం పడుతుంది.

నిద్రలేమి(Insomnia)తో మానసిక ఒత్తిడి..

కెఫీన్ అతిగా తీసుకునే యువతలో నిద్రలేమి (Insomnia) సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సాయంత్రం లేదా రాత్రి వేళల్లో కెఫీన్ తీసుకోవడం వల్ల నిద్ర పట్టే సమయం ఆలస్యమై, గాఢ నిద్ర లోపిస్తుంది. పడుకోవడానికి ఆరు గంటల ముందు తీసుకున్నా అది నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. నిరంతర నిద్రలేమి వల్ల ఏకాగ్రత తగ్గడం, చిరాకు, పనుల్లో ఉత్పాదకత పడిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం..

అధిక మోతాదులో కెఫీన్ గుండె స్పందనల వేగాన్ని (Heart Rate), రక్తపోటును తాత్కాలికంగా పెంచుతుంది. ఎనర్జీ డ్రింక్స్ సేవించిన వెంటనే పెద్దవారిలో సైతం సిస్టోలిక్, డయాస్టోలిక్ రక్తపోటు పెరిగినట్లు అధ్యయనాలు వెల్లడించాయి. ఇప్పటికే అధిక రక్తపోటు (bp), గుండె సంబంధిత సమస్యలు లేదా గుండె లయ తప్పే సమస్యలు ఉన్నవారు కెఫీన్‌ ఉత్పత్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

టీ, కాఫీలను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని, అయితే వాటి పరిమాణం, సమయంపై నియంత్రణ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు రెండు కప్పులకు మించి కాఫీ లేదా టీ తీసుకోకపోవడం శ్రేయస్కరం. అలసట, నీరసం వచ్చినప్పుడల్లా ఎనర్జీ డ్రింక్స్, శీతల పానీయాలపై ఆధారపడటం మానాలి. మధ్యాహ్నం 3 లేదా 4 గంటల తర్వాత కెఫీన్ ఉండే ఆహారాలు, పానీయాలకు దూరంగా ఉంటే రాత్రి వేళల్లో ప్రశాంతమైన నిద్ర సొంతమవుతుంది.

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..

ఇది కూడా చదవండి..Low Birth Weight : తక్కువ బరువుతో పుడితే.. పెద్దయ్యాక పక్షవాతం ముప్పు..! తాజా అధ్యయనం..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.