IT Sector : ఐటీ రంగంలో పెరుగుతున్న హెచ్‌ఐవీ.. హెచ్చరించిన NACO 

షేర్ చేయండి:
IT Sector : ఐటీ రంగంలో పెరుగుతున్న హెచ్‌ఐవీ.. హెచ్చరించిన NACO 

సాక్షి లైఫ్ : దేశంలోని అనేక రాష్ట్రాలలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో పనిచేస్తున్న వారిలో హెచ్ఐవి ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయని భారతదేశ జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (NACO - National AIDS Control Organisation) హెచ్చరించింది. ఐటీ ఉద్యోగులలో హెచ్ఐవి పరీక్షలను పెంచాలని, పెరుగుతున్న ఈ కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంఘాలను NACO కోరింది.

 

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?

 

తెలంగాణలో, ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఐటీ (Information Technology) రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులలో హెచ్‌ఐవీ (HIV) కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయంలో జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (NACO - National AIDS Control Organisation) రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. యువత అధికంగా ఉండే ఐటీ రంగంలో ఈ వైరస్ వ్యాప్తి పెరగడంపై తక్షణమే దృష్టి సారించాలని సూచించింది.

పెరుగుదలకు కారణాలు ఇవే..!

ఐటీ రంగంలోని ఉద్యోగులలో కేసుల పెరుగుదలకు ప్రధానంగా విచ్చలవిడి జీవనశైలి, వీకెండ్ పార్టీలు, సురక్షితం కాని లైంగిక పద్ధతులు (Unsafe Sexual Practices), మద్యం, మాదకద్రవ్యాల (Drugs) వినియోగం వంటివి కారణాలుగా నివేదికలు పేర్కొంటున్నాయి. 

తెలంగాణరాష్ట్రంలో హెచ్‌ఐవి వ్యాప్తి 2023లో 0.44శాతం నుంచి 2025లో 0.41శాతానికి తగ్గిందని తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంఘం తెలిపింది. అదే సమయంలో ఎయిడ్స్ సంబంధిత మరణాలు 80శాతం తగ్గాయని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 8,21,508 మందిని సొసైటీ పరీక్షించి 5,517 కొత్త హెచ్‌ఐవి కేసులను గుర్తించింది. తెలంగాణలో ఇప్పటివరకు 1,98,290 మందికి హెచ్‌ఐవి ఉందని, వారందరికీ యాంటీరెట్రోవైరల్ థెరపీ లభిస్తోందని అధికారులు తెలిపారు. 2024–25లో 193 మంది చనిపోగా, 2023–24లో 1,977 మంది హెచ్‌ఐవితో మరణించినట్లు అధికారులు తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రుల రికార్డుల ప్రకారం రాష్ట్రంలో 1.28 లక్షల మంది బాధితులు ఉన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు, హోమియోపతి ఆసుపత్రుల నుంచి సేకరించిన డేటా ప్రకారం.. ప్రైవేట్, హోమియోపతి, ఆయుర్వేద ఆసుపత్రుల నుంచి సేకరించిన TSACS డేటా ప్రకారం.. 5,600 మంది ప్రయివేటుగా చికిత్స తీసుకుంటుండగా, హోమియోపతి ఆసుపత్రుల్లో దాదాపు 5,000 మందిని గుర్తించింది. మొత్తంగా, HIV తో నివసిస్తున్న 1.38 లక్షల మంది వ్యక్తుల వివరాలను ఇప్పుడు జాతీయ NACO డేటాబేస్‌కు అనుసంధానించారు.

ఇరవై రెండు ప్రభుత్వ కేంద్రాలు, ఎనిమిది ప్రైవేట్ కేంద్రాలు ప్రస్తుతం ఉచితంగా కౌన్సెలింగ్, మందులు, రోగనిర్ధారణ సేవలను అందిస్తున్నాయి. అంతేకాదు ఎయిడ్స్ బాధితులకు పెన్షన్ కూడా ఇస్తున్నారు. 2023లో 34,656 మంది లబ్ధిదారులకు పెన్షన్ పొందుతుండగా ఈ సంవత్సరం 45,374మందికి పెన్షన్ అందిస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

 

ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే....? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.