Rising Kidney Diseases in Hyderabad : హైదరాబాద్‌లో పెరుగుతున్న కిడ్నీ వ్యాధులు.. కారణాలు ఇవే..
సాక్షి లైఫ్ : నగర జీవనశైలిలో చోటుచేసుకుంటున్న మార్పులు మానవ శరీరంలోని కీలక అవయవమైన మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇటీవల హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన కిడ్నీ స్క్రీనింగ్ పరీక్షల్లో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. ఒక ప్రైవేట్ వైద్య సంస్థ గత ఏడాది (2025) ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ప్రారంభించిన మొబైల్ స్క్రీనింగ్ ద్వారా సుమారు 10,368 మందిని పరీక్షించగా.. వారిలో ఎక్కువ మందికి కిడ్నీ వ్యాధుల ముప్పు ఉన్నట్లు తేలింది.
ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
యువతలోనే అధికం..
ఈ పరీక్షల్లో పాల్గొన్న వారి సగటు వయస్సు 39 ఏళ్లు మాత్రమే కావడం గమనార్హం. మొత్తం పరీక్షలు చేయించుకున్న వారిలో 59 శాతం మంది 21 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు గల యువతే కావడం ఆందోళన కలిగిస్తోంది. వీరిలో 24 శాతం మందికి పైగా 'హైపర్ టెన్షన్' (అధిక రక్తపోటు) ఉన్నట్లు గుర్తించారు. మూత్రపిండాల వ్యాధికి ప్రధాన కారణం ఈ అధిక రక్తపోటేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
లక్షణాలు లేకున్నా ప్రమాదమే..
స్క్రీనింగ్ పరీక్షల ద్వారా కిడ్నీ వ్యాధి వివిధ దశల్లో ఉన్న వారిని గుర్తించారు..
స్టేజ్ 3: 2.46 శాతం మంది
స్టేజ్ 4: 0.33 శాతం మంది
స్టేజ్ 5: 0.07 శాతం మంది
పరీక్షలు చేయించుకున్న వారిలో సుమారు 90 శాతం మందికి ఎటువంటి లక్షణాలు (Symptoms) లేవు. అయినప్పటికీ పరీక్షల్లో వారికి వ్యాధి ముప్పు ఉన్నట్లు తేలింది. అందుకే ముందస్తు పరీక్షలు చాలా అవసరమని నెఫ్రాలజిస్టులు చెబుతున్నారు.
వ్యాధికి కారణాలేమిటి అంటే..?
తెలంగాణలో కిడ్నీ వ్యాధుల ప్రాబల్యం గతంలో 3-4 శాతంగా ఉండగా, ప్రస్తుతం అది 7.4 శాతానికి చేరింది. దీనికి ప్రధాన కారణాలు ఇవే.. గంటల తరబడి కూర్చుని పని చేయడం, తగినంత వ్యాయామం లేకపోవడం.
ఆహారపు అలవాట్లు..ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, తక్కువగా నీళ్లు తాగడం. ఇతర సమస్యలు..మధుమేహం, రక్తపోటు, విపరీతమైన ఒత్తిడి. తరచుగా పెయిన్ కిల్లర్స్ వాడటం.
ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?
కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వైద్యులు పలుసూచనలు చేస్తున్నారు. అవేంటంటే..?
రక్తపోటును (BP) నిరంతరం పర్యవేక్షించుకోవాలి.
ఆహారంలో ఉప్పు వాడకాన్ని తగ్గించాలి.
శరీర బరువు అదుపులో ఉంచుకోవాలి.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.
అధిక రక్తపోటు ఉన్నవారు క్రమం తప్పకుండా కిడ్నీ పనితీరు పరీక్షలు (Kidney Function Tests) చేయించుకోవడం ద్వారా ముందస్తుగా నష్టాన్ని నివారించవచ్చు.
ఇది కూడా చదవండి..ఈ 5 సప్లిమెంట్స్ కు డబ్బు దండగ అంటున్న వైద్యనిపుణులు..!
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
