Scrub Typhus : పల్నాడులో 'స్క్రబ్ టైఫస్' కలకలం ఇద్దరి మృతి..  

షేర్ చేయండి:
Scrub Typhus : పల్నాడులో 'స్క్రబ్ టైఫస్' కలకలం ఇద్దరి మృతి..  

సాక్షి లైఫ్ : ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలో 'స్క్రబ్ టైఫస్' (Scrub Typhus) వ్యాధి కలకలం రేపుతోంది. చిగ్గర్‌ మైట్ (Chigger Mite) అనే చిన్న కీటకం కాటు వల్ల వచ్చే ఈ వ్యాధి కారణంగా ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పెరుగుతున్న స్క్రబ్ టైఫస్ కేసుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తొలి లక్షణాలు కనిపించగానే వెంటనే చికిత్స తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులు, వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..? 

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?

 వ్యాధి లక్షణాలను గుర్తించడం ఎలా అంటే..?

స్క్రబ్ టైఫస్ అనేది ఓరియెంటియా త్సుత్సుగాముషి అనే బ్యాక్టీరియా వల్ల సోకుతుంది. ఈ బ్యాక్టీరియా సోకిన చిగ్గర్ మైట్ అనే పురుగు అంటే నల్లిని పోలిన కీటకం కాటు ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. కీటకం కుట్టిన తర్వాత 6 నుంచి 21 రోజుల్లోపు లక్షణాలు బయటపడతాయి. సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే పరిస్థితి విషమించే ప్రమాదం ఉంది.

 అకస్మాత్తుగా అధిక జ్వరం.. 

ఈ కీటకం కుట్టిన చోట నొప్పి లేని నల్లటి మచ్చ లేదా పుండు ఏర్పడటం. ఇది స్క్రబ్ టైఫస్‌కు ముఖ్య లక్షణం. కండరాలు, కీళ్లలో విపరీతమైన నొప్పి. చలి, వణుకు, ఒళ్లంతా దద్దుర్లు, శోషరస గ్రంథులు (Lymph Nodes) వాపు, పొడి దగ్గు, జీర్ణ సంబంధ సమస్యలు (వాంతులు, కడుపు నొప్పి).

  సకాలంలో చికిత్సే శరణ్యం.. 

స్క్రబ్ టైఫస్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే యాంటీబయాటిక్స్ (Doxycycline లేదా Azithromycin) మందులతో పూర్తిగా నయం చేయవచ్చు. చికిత్స ఆలస్యమైతే మాత్రం వ్యాధి తీవ్రమై మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కు దారి తీయడమేకాకుండా, ఒక్కోసారి ప్రాణాలకే ముప్పు కలుగవచ్చు. మరణాల రేటు 2 శాతం లోపు తగ్గాలంటే వెంటనే చికిత్స పొందాలి.

  తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..?  

స్క్రబ్ టైఫస్ అంటువ్యాధి కాదు. కీటకం కాటు ద్వారానే ఇది వ్యాపిస్తుంది. పొలాలు, పొదలు, తడి నేలలు, పశువుల పాకలు వంటి ప్రాంతాల్లో ఈ కీటకాలు ఎక్కువగా ఉంటాయి. తోటలు, పొలాల్లో పనిచేసేవారు తప్పనిసరిగా చేతులు కూడా కప్పివుంచే చొక్కాలు, ప్యాంట్లు, సాక్సులు, బూట్లు ధరించాలి. పిల్లలు ఆడుకునేటప్పుడు కాళ్లు, చేతులు కప్పి ఉండేలా దుస్తులు వేయాలి.ఇంటి పరిసరాలను, పాత వస్తువులను, వ్యర్థాలను శుభ్రంగా ఉంచాలి. తీవ్రమైన జ్వరం, ఒంటి నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే సొంత వైద్యం మానుకుని, వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.

 

ఇది కూడా చదవండి..ఒక వ్యక్తికి రోజుకి ఎన్ని కేలరీస్ అవసరం..?  

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.