High Fever : తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారా..? తొలి 24 గంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : వానాకాలంలో వచ్చే జ్వరాలను సాధారణ వైరల్ ఫీవర్‌గా భావించి నిర్లక్ష్యం చేయడం ఏమాత్రం మంచిది కాదు. వాతావరణ మార్పుల కారణంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా డెంగ్యూ, మలేరియా, చికెన్‌గున్యా, స్వైన్ ఫ్లూ (H1N1) వంటి వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రారంభంలో ఈ వ్యాధుల లక్షణాలన్నీ దాదాపు ఒకేలా ఉంటాయి కాబట్టి, జ్వరం వచ్చిన మొదటి 24 గంటలు చాలా కీలకం.

ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?

 

లక్షణాలు ఒకేలా.. ముప్పు వేరు..

డెంగ్యూ, మలేరియా లేదా సాధారణ వాతావరణ జ్వరం ఏదైనా సరే.. తొలిదశలో లక్షణాలు ఒకేలా ఉంటాయి. జ్వరం ఎప్పుడు మొద లైంది..? ఉష్ణోగ్రత ఎంతుందనేది ఎప్పటికప్పుడు గమనించాలి. జ్వరంతో పాటు తీవ్రమైన తలనొప్పి, కీళ్ల నొప్పులు, వాంతులు, విరేచనాలు, గొంతు నొప్పి, కళ్ల వెనుక భాగంలో నొప్పి వంటివి ఉంటే అప్రమత్తం కావాలి. లక్షణాలు తీవ్రమవుతుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.

ద్రవాహారంతో డీహైడ్రేషన్‌కు చెక్..

జ్వరం వచ్చినప్పుడు శరీరంలో నీటి శాతం వేగంగా పడిపోతుంది. కాబట్టి క్రమం తప్పకుండా ద్రవాహారం తీసుకుంటూ ఉండాలి. కాచి చల్లార్చిన నీరు, ఓఆర్ఎస్ (ORS), తాజా పండ్ల రసాలు ఎక్కువగా తాగాలి. దీనివల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటమే కాకుండా, శరీర ఉష్ణోగ్రత కూడా అదుపులో ఉంటుంది.

సొంత వైద్యం ప్రమాదకరం..  

జ్వరం, ఒళ్లు నొప్పులు తగ్గడానికి ప్రాథమికంగా పారాసెటమాల్ వేసుకోవచ్చు. కానీ, 24 నుంచి 48 గంటలైనా జ్వరం తగ్గకపోయినా.. తగ్గి మళ్లీ వస్తున్నా తప్పనిసరిగా డాక్టర్‌ను కలవాలి. డెంగ్యూ అనుమానం ఉన్నప్పుడు ఆస్పిరిన్, ఐబూప్రోఫెన్ వంటి పెయిన్ కిల్లర్స్ సొంతంగా వాడకూడదు. ఇవి అంతర్గత రక్తస్రావం ముప్పును పెంచుతాయి. వైరల్ జ్వరాలకు యాంటీబయాటిక్స్ ఏమాత్రం పనిచేయవు. కాబట్టి, డాక్టర్ సలహా లేకుండా యాంటీబయాటిక్స్ వాడటం సురక్షితం కాదు.

ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి..

ప్రతీ జ్వరాన్ని డెంగ్యూ అనుకోకూడదు, అలాగని సాధారణ జ్వరమే కదా అని తీసిపారేయకూడదు. జ్వరం తగ్గగానే వ్యాధి నయమైపో యిందని భావించకూడదు. ముఖ్యంగా డెంగ్యూలో జ్వరం తగ్గిన తర్వాతే ప్లేట్‌లెట్స్ పడిపోయి ఆరోగ్య పరిస్థితి విషమించే ప్రమాదం ఉంటుంది. ఉష్ణోగ్రత తగ్గిన తర్వాత కూడా నిరంతరంగా వాంతులు కావడం, తీవ్రమైన కడుపునొప్పి, చిగుళ్లు లేదా ముక్కు నుంచి రక్తం రావడం, తీవ్రమైన నీరసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి.

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..Sippers and Tumblers : సిప్పర్లు, టంబ్లర్లలో నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..?

ఇది కూడా చదవండి..Low Birth Weight : తక్కువ బరువుతో పుడితే.. పెద్దయ్యాక పక్షవాతం ముప్పు..! తాజా అధ్యయనం..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.