Super El Nino Alert: ముంచుకొస్తున్న 'సూపర్ ఎల్ నినో'..! రానున్న 2 నెలలు నిప్పుల కొలిమిలా మారనున్న సూర్యుడు.. వాతావరణ శాఖ హెచ్చరిక..
సాక్షి లైఫ్ : సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. మే నెల ప్రారంభం కాకముందే దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం, ఈ ఏడాది 'సూపర్ ఎల్ నినో' ప్రభావంతో ఎండల తీవ్రత ఊహించని స్థాయిలో ఉండబోతోంది. పసిఫిక్ మహాసముద్రంలో చోటుచేసుకుంటున్న మార్పులు వేల మైళ్ల దూరంలో ఉన్న మన ఆరోగ్యాన్ని, జీవనశైలిని అతలాకుతలం చేయనున్నాయి.
'సూపర్ ఎల్ నినో' అంటే..?
పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు సగటు స్థాయితో పోలిస్తే 0.5°C నుంచి 1.4°C వరకు పెరిగితే దానిని ‘ఎల్ నినో’గా శాస్త్రవేత్తలు నిర్వచిస్తారు. అయితే ఈ ఉష్ణోగ్రతలు 2.0°C కంటే ఎక్కువగా పెరిగినప్పుడు పరిస్థితి మరింత తీవ్రంగా మారి ‘సూపర్ ఎల్ నినో’గా పరిగణిస్తారు.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ వాతావరణ సమతుల్యత దెబ్బతింటుంది. ముఖ్యంగా భారతదేశం సహా అనేక దేశాల్లో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగి వేడి గాలులు తీవ్రరూపం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సూపర్ ఎల్ నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు 45 నుంచి 48 వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ తీవ్రమైన వేడి వల్ల తలెత్తే ప్రధాన ఆరోగ్య సమస్యలు ఇవే..
వడదెబ్బ (Heat Stroke)..
శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించే వ్యవస్థ విఫలమై, ప్రాణాపాయ స్థితికి దారితీయవచ్చు. విపరీతమైన చెమట వల్ల శరీరంలోని లవణాలు, నీరు తగ్గిపోయి నీరసం, కళ్ళు తిరగడం వంటివి సంభవిస్తాయి. వేడి గాలుల వల్ల గాలిలో నాణ్యత తగ్గి, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారికి ఇబ్బందులు పెరుగుతాయి.చర్మ వ్యాధులు: చెమట పొక్కులు, ఇన్ఫెక్షన్లు,వంటి సమస్యలు వేధిస్తాయి.
ముందస్తు జాగ్రత్తలు..
రక్షణ సూత్రాలువేడి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి వైద్య నిపుణులు సూచిస్తున్న సలహాలు.. ద్రవ పదార్థాలు అధికంగా తీసుకోండి: దాహం వేయకపోయినా తరచుగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ఓఆర్ఎస్ (ORS) ద్రావణం తీసుకోవాలి. ఆహార నియమాలు..నూనెలో వేయించిన పదార్థాలు, మసాలాలు తగ్గించి.. ఆకుకూరలు, దోసకాయ, పుచ్చకాయ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.దుస్తుల ఎంపిక: లేత రంగు కాటన్ దుస్తులకే ప్రాధాన్యత ఇవ్వండి.
బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, టోపీ తప్పనిసరి.. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడమే శ్రేయస్కరం. సూపర్ ఎల్ నినో ప్రభావంతో వాతావరణంలో తేమ తగ్గి, పొడి గాలి తీవ్రత పెరుగుతుంది. ఇది కేవలం మనుషులపైనే కాకుండా పశుపక్షాదులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇంటి బయట పక్షుల కోసం నీటి పాత్రలను ఉంచడం మర్చిపోకండి.
ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..
ఇది కూడా చదవండి.. మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
