'స్వస్థ నారీ, సశక్త్ పరివార్ అభియాన్' ప్రారంభం.. మహిళల ఆరోగ్యంపై కేంద్రం ప్రత్యేక దృష్టి..
సాక్షి లైఫ్ : కేంద్ర ప్రభుత్వం మహిళలు, పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో 'స్వస్థ నారీ, సశక్త్ పరివార్ అభియాన్' అనే ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు దేశవ్యాప్తంగా ఈ శిబిరాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహాలతో కలిసి ప్రారంభించారు.
ఇది కూడా చదవండి.. శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల క్యాన్సర్ వస్తుందా..?
ఇది కూడా చదవండి.. ఆర్గానిక్ ఫ్రూట్స్ ను గుర్తించాలంటే ఏమిచేయాలి.. ?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
శిబిరాల నిర్వహణ: ఈ 15 రోజుల కార్యక్రమంలో భాగంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో మహిళల కోసం ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తారు.
ఉచిత వైద్యపరీక్షలు..
మహిళలకు బీపీ, షుగర్, నోటి క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్, అనీమియా పరీక్షలు ఉచితంగా చేస్తారు. గైనకాలజిస్టులు, నేత్ర వైద్యులు, దంత వైద్యులు వంటి నిపుణులు అందుబాటులో ఉంటారు.
మాతా శిశు సంరక్షణ...
గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య పరీక్షలు, కౌన్సెలింగ్ అందిస్తారు. పిల్లలకు టీకాలు వేసి, మదర్-చైల్డ్ ప్రొటెక్షన్ కార్డులు పంపిణీ చేస్తారు.
ఆర్థిక సహాయం..
'ప్రధాన మంత్రి మాతృ వందన యోజన' (PMMVY) కింద ఇప్పటివరకు 4 కోట్ల మంది తల్లులకు రూ. 19 వేల కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. మొదటి బిడ్డకు రూ. 5 వేలు, రెండో బిడ్డ అమ్మాయి అయితే అదనంగా మరో రూ. 6 వేలు ఇస్తారు.
అవగాహన కార్యక్రమాలు..
మహిళలకు పరిశుభ్రత, పోషణపై ప్రత్యేక అవగాహన సెషన్లు నిర్వహిస్తారు. స్వయం సహాయక సంఘాల సహకారంతో పోషకాహారంపై అవగాహనా కార్యక్రమాలు చేపడతారు.
క్షయ నిర్మూలన..
'టీబీ ముక్త్ భారత్' లక్ష్యంగా నిక్షయ మిత్ర నమోదు పేరుతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తారు. ఎవరైనా టీబీ రోగులను దత్తత తీసుకోవడానికి ముందుకు వస్తే వారిని ప్రోత్సహిస్తారు.
రక్తదాన శిబిరాలు..
ఈ కార్యక్రమం కింద అక్టోబర్ 1న జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు నిర్వహిస్తారు. ఈ డ్రైవ్ ద్వారా లక్ష యూనిట్ల రక్తాన్ని సేకరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం మహిళలు, పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఒక కీలక అడుగుగా నిలుస్తుందని బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఇది కూడా చదవండి.. సికిల్ సెల్ వ్యాధి అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి.. స్మోకింగ్ అలవాటు లేనివారు లంగ్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
