తెలంగాణ డీసీఏ హెచ్చరిక: ఆ రెండు సిరప్‌లను వెంటనే ఆపేయండి..!

సాక్షి లైఫ్ : తల్లిదండ్రులు, రెండేళ్ల లోపు పిల్లలకు డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి దగ్గు మందులు ఇవ్వవద్దని ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది. 'రిలైఫ్' (Relife) 'రెస్పిఫ్రెష్ TR' (Respifresh TR) అనే రెండు దగ్గు సిరప్‌ల వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలని తెలంగాణ రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (TGCDA) ప్రజలను, ముఖ్యంగా తల్లిదండ్రులను, రిటైలర్లను, ఆసుపత్రులను కోరింది.

ఇది కూడా చదవండి..CKD: దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి (CKD) ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 

ఎందుకంత ప్రమాదం..?

విషపూరిత రసాయనం: ఈ సిరప్‌లలో అత్యంత విషపూరితమైన డైథిలిన్ గ్లైకాల్ (Diethylene Glycol - DEG) అనే కలుషిత పదార్థం ఉన్నట్లు మధ్యప్రదేశ్ డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్‌లో గుర్తించారు.

కిడ్నీ ఫెయిల్యూర్.. 

 ఈ విషపూరితమైన DEG వల్ల పిల్లల్లో కిడ్నీలు (మూత్రపిండాలు) పూర్తిగా దెబ్బతిని, ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్‌లలో ఈ దగ్గు సిరప్‌ల కారణంగా చిన్నారులు మరణించినట్లు నివేదికలు వచ్చాయి.

ఏయే సిరప్‌లు వాడవద్దు..?

తెలంగాణ డీసీఏ డైరెక్టర్ షా నవాజ్ ఖాసిం తెలిపిన వివరాల ప్రకారం, కింది బ్యాచ్‌లకు చెందిన సిరప్‌లలో విష పదార్థాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు:

రిలైఫ్ కఫ్ సిరప్ (Relife Cough Syrup) (అంబ్రోక్సోల్, గువాయిఫెనెసిన్, టెర్బుటలైన్ సల్ఫేట్ & మెంథాల్ సిరప్)

బ్యాచ్ నెం: LSL25160

రెస్పిఫ్రెష్ TR సిరప్ (Respifresh TR Syrup) (బ్రోమ్హెక్సైన్ హైడ్రోక్లోరైడ్, టెర్బుటలైన్ సల్ఫేట్, గువాయిఫెనెసిన్ & మెంథాల్ సిరప్)

బ్యాచ్ నెం: R01GL2523

ఈ రెండు సిరప్‌లను గుజరాత్‌కు చెందిన రెడ్‌నెక్స్ ఫార్మాస్యూటికల్స్ తయారు చేశాయి.

ఒకవేళ మీ దగ్గర ఉంటే ఏం చేయాలి..?

మీ దగ్గర కానీ, మీ దగ్గరలోని మెడికల్ షాప్ లో కానీ ఈ సిరప్‌లు ఉంటే, వాటిని వెంటనే వాడటం ఆపేసి, సమీపంలోని డీసీఏ కార్యాలయంలో గానీ, టోల్-ఫ్రీ నెంబర్ 1800-599-6969కు కాల్ చేసి గానీ రిపోర్ట్ చేయండి. చైల్డ్ హెల్త్ ఎక్స్‌పర్ట్స్ ఈ మొత్తం వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపి, ఔషధ తయారీ ప్రమాణాలపై మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

 

ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : telangana telangana-state telangana-state-government toxic-chemicals diethylene-glycol-(deg) toxic-cough-syrup contaminated-cough-syrup cough-syrup-poisoning cough-syrup-crisis telangana-dca-alert respifresh-tr-syrup rednex-pharmaceuticals tgcda-news tgcda-warning
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com