నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: మంత్రి దామోదర రాజనర్సింహ

షేర్ చేయండి:
నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: మంత్రి దామోదర రాజనర్సింహ

సాక్షి లైఫ్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని షేక్‌పేట సాంఘిక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన విద్యార్థులకు ఆల్బెండజోల్ టాబ్లెట్లను పంపిణీ చేసి, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి.. నల్ల ఉప్పుతో ఆరోగ్య ప్రయోజనాలివే 

ఇది కూడా చదవండి.. ఋతు పరిశుభ్రత దినోత్సవం చరిత్ర, ప్రాముఖ్యత..

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ నెల 18 వరకు తెలంగాణలోని 33 జిల్లాలలో సుమారు 96 లక్షల 17 వేల మందికి పైగా విద్యార్థినీ, విద్యార్థులకు ఆల్బెండజోల్ టాబ్లెట్లను అందించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలన్నీ ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యి, దీనిని విజయవంతం చేయాలని ఆయన సూచించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు

వైద్య రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల టెస్టులతో పాటు మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

విద్యార్థులు దేశ సంపద.. 

విద్యార్థులు దేశ సంపద అని, ప్రతి ఒక్కరూ చదువుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. ఆ దిశగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆయన తెలిపారు.

అంగన్‌వాడీ కేంద్రాలలో..  

రాష్ట్రంలోని 35,700 అంగన్‌వాడీ కేంద్రాలలో, అలాగే 52,165 వివిధ పాఠశాలల్లో ఈ నులిపురుగుల నివారణ కార్యక్రమం చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. పిల్లల వయస్సును బట్టి వివిధ మోతాదుల్లో టాబ్లెట్లను అందించాలని ఆయన అధికారులకు సూచించారు.

ఇది కూడా చదవండి..కాలేయం, కిడ్నీ సమస్యలున్నప్పుడు కనిపించే 5 కీలక సంకేతాలు ఇవే..

ఇది కూడా చదవండి..హైపోథైరాయిడిజాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి ఏమేం చేయాలి..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.