Surrogacy Services : అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణరాష్ట్రంలో సరోగసీ సేవల కోసం ప్రత్యేక పోర్టల్..
సాక్షి లైఫ్ : తెలంగాణరాష్ట్రంలో సరోగసీ, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (ART) సేవలను క్రమబద్ధీకరించేందుకు వైద్య ఆరోగ్య శాఖ కీలక అడుగు వేసింది. ఇటీవల వెలుగుచూసిన శిశువుల విక్రయ ఉదంతాల నేపథ్యంలో, ఈ ప్రక్రియలో పారదర్శకత పెంచేందుకు ఒక సమగ్ర డిజిటల్ పోర్టల్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఇది కూడా చదవండి..How Social Relationships Impact the Brain : సామాజిక సంబంధాలు మెదడును ఎంతలా ప్రభావితం చేస్తాయో తెలుసా..?
ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..?
నిఘా నీడలో సంతాన సాఫల్య కేంద్రాలు..
గతంలో సరోగసీ అనుమతులు, పత్రాల పరిశీలన అంతా మాన్యువల్ పద్ధతిలో జరిగేది. దీనివల్ల పర్యవేక్షణ లోపించి అక్రమాలకు తావు ఏర్పడుతోందని గుర్తించిన అధికారులు, ఇకపై అన్ని దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారానే స్వీకరించనున్నారు.
దరఖాస్తు విధానం..
సరోగసీ కోరుకునే దంపతులు తమ మెడికల్ సర్టిఫికెట్లు, అర్హత ధృవీకరణ పత్రాలు, ఇన్సూరెన్స్ వివరాలను తప్పనిసరిగా పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి.
సింగిల్ విండోసిస్టమ్ (Single-Window System)..
దరఖాస్తుల పరిశీలన, క్షేత్రస్థాయి తనిఖీలు, అనుమతుల జారీ అంతా ఈ డిజిటల్ వేదిక ద్వారానే జరుగుతుంది. నిబంధనల ఉల్లంఘన జరిగితే వ్యవస్థే స్వయంచాలకంగా నోటీసులు జారీ చేస్తుంది.
పి.సి.పి.ఎన్.డి.టి (PCPNDT) అమలు..
లింగ నిర్ధారణ పరీక్షల నిరోధక చట్టం అమలును కూడా ఈ పోర్టల్ ద్వారా మరింత పటిష్టం చేయనున్నారు. అందుబాటులోకి ట్రామా కేర్, డీ-అడిక్షన్ సెంటర్లు.. సరోగసీ పోర్టల్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య సేవలను మెరుగుపరిచేందుకు మరికొన్ని కీలక నిర్ణయాలను మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. ప్రమాదాలు జరిగినప్పుడు 'గోల్డెన్ అవర్'లో ప్రాణాలు కాపాడేందుకు రాష్ట్రవ్యాప్తంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను (CHC) అప్‌గ్రేడ్ చేసి ట్రామా కేర్ సెంటర్లుగా మారుస్తున్నారు.
ఎర్రగడ్డలోని మానసిక ఆరోగ్య సంస్థలో కొత్తగా 'డీ-అడిక్షన్' సెంటర్‌ను ప్రారంభించారు. ఇలాంటి కేంద్రాలు ఇప్పటికే రాష్ట్రంలోని 35 ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నట్లు మంత్రి తెలిపారు. నిమ్స్‌లో అత్యాధునిక మెడికల్ లీనియర్ యాక్సిలరేటర్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. సాంకేతికత సాయంతో అక్రమాలకు తావులేకుండా వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
