Telangana on Heatstroke Alert : వడదెబ్బపై తెలంగాణ అలర్ట్.. ఆసుపత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : తెలంగాణ రాష్ట్రంలో ఎండలు నిప్పులు చెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వడదెబ్బ (Heatstroke) బాధితులకు తక్షణమే మెరుగైన చికిత్స అందించేలా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక ఎమర్జెన్సీ ప్రోటోకాల్‌ను అమలు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి సి. దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన వేసవి కార్యాచరణను ప్రకటించారు.

 

ఇది కూడా చదవండి..నడక, పరుగు.. ఈ రెండిటిలో ఏది ఉత్తమం..? 

ఇది కూడా చదవండి..లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?

ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

 

ఆసుపత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు..

ఎండ తీవ్రత దృష్ట్యా రోగులు, వారి సహాయకులకు అసౌకర్యం కలగకుండా ఆసుపత్రుల్లో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి సి. దామోదర రాజనర్సింహ సూచించారు.

ఎమర్జెన్సీ టీమ్స్..వడదెబ్బ కేసులను డీల్ చేసేందుకు ప్రతి ఆసుపత్రిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలి. ఓఆర్ఎస్ (ORS) ప్యాకెట్లు, అవసరమైన మందులు, ఐవీ ఫ్లూయిడ్స్ నిరంతరం అందుబాటులో ఉంచాలి.

వార్డుల్లో ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేయడంతో పాటు ఐసీయూల్లో ఏసీలు సక్రమంగా పనిచేసేలా చూడాలి. ఆసుపత్రి ప్రాంగణాల్లో చల్లని తాగునీటి సౌకర్యం కల్పించాలి.

పాఠశాలలు, పనివేళల్లో మార్పులు..?

పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా విద్యార్థులు, కార్మికుల రక్షణ కోసం పలు కీలక సూచనలు చేశారు..పాఠశాలల్లో 'వాటర్ బ్రేక్స్' తప్పనిసరి చేయాలని, ఎండ తీవ్రతను బట్టి పనివేళలు తగ్గించడం లేదా సెలవులపై మార్గదర్శకాలు జారీ చేయాలని విద్యాశాఖను ఆదేశించారు. బయట పనిచేసే వారు..భవన నిర్మాణ కార్మికులు, ఇతర కూలీలు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఎండలో పనిచేయకుండా పనివేళలు సవరించుకోవాలని సూచించారు.

ప్రజలకు అవగాహన..  

వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి రద్దీ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. అలాగే, ఆసుపత్రుల్లో షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు జరగకుండా ఎలక్ట్రికల్ ఆడిట్ నిర్వహించి, పాత వైరింగ్‌ను మార్చాలని ఆదేశించారు. ప్రజలు ఎండ నుండి ఉపశమనం పొందేందుకు వీలుగా బహిరంగ ప్రదేశాల్లో చలివేంద్రాలు, కూలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించారు.

 ఎండ తీవ్రత అధికంగా ఉండే మధ్యాహ్నం వేళల్లో ప్రజలు బయటకు రాకుండా ఉండటమే క్షేమమని వైద్యులు సూచిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా వడదెబ్బకు గురైతే, వెంటనే వారిని నీడకు చేర్చి, తడి గుడ్డతో శరీరాన్ని తుడుస్తూ.. దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలి.

 

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ రావడానికి ప్రధాన కారణాలు..?

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ అంటే ఏమిటి..? 

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ ఎలాంటి వారికి వస్తుంది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.