టెఫ్లాన్ ఫ్లూ ఎలాంటి వారికి వస్తుంది..?
సాక్షి లైఫ్ : లోహాలు, ప్లాస్టిక్ ఉత్పత్తులను కాల్చడం వల్ల వెలువడే పొగలు పీల్చేవారికి టెఫ్లాన్ ఫ్లూ వచ్చే ముప్పు ఉందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. దీని కారణంగా క్యాన్సర్ వంటి వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. మెటల్ వెల్డింగ్ చేసే వ్యక్తులకు ఇలాంటి ముప్పు ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ రావడానికి ప్రధాన కారణాలు..?
ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..నడక, పరుగు.. ఈ రెండిటిలో ఏది ఉత్తమం..?
రసాయనిక పొగ..
ఐతే ఇలాంటి రసాయనిక పొగ ప్రభావాన్ని నివారించడానికి సరైన రక్షణ పరికరాలను ఉపయోగించడం మేలని వైద్యనిపుణులు చెబుతున్నారు. వెల్డింగ్ సమయంలో రాగి, ఇనుము, అల్యూమినియంతో సహా వివిధ లోహాల నుంచి వచ్చే కెమికల్స్ విడుదలవుతాయి. అవి శరీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. టెఫ్లాన్ పూతతో కూడిన వంటసామాన్లను వినియోగించేవారు కూడా టెఫ్లాన్ ఫ్లూ బారిన పడవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.
టెఫ్లాన్ ఫ్లూ లక్షణాలు..?
జ్వరం, చలి, దగ్గు, ఛాతీ నొప్పి, శ్వాసతీసుకోవడంలో లోపం, తలనొప్పి, మైకము, అలసట, అనారోగ్యం, వికారం, వాంతులు, కండరాల నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి పొగ పీల్చిన కొన్ని గంటల తర్వాత కీళ్ల నొప్పులు కూడా వస్తాయని వైద్యనిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..న్యూరోసర్జన్లు వెన్నెముక శస్త్రచికిత్స చేయడానికి కూడా అర్హులే
ఇది కూడా చదవండి..పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
