Unnecessary Use of Antibiotics : అవసరంలేకున్నా యాంటీబయోటిక్స్‌ వాడితే ప్రాణాపాయం.. ఐఎంఏ హెచ్చరిక

షేర్ చేయండి:
Unnecessary Use of Antibiotics : అవసరంలేకున్నా యాంటీబయోటిక్స్‌ వాడితే ప్రాణాపాయం.. ఐఎంఏ హెచ్చరిక

సాక్షి లైఫ్ : చిన్నపాటి జ్వరం వచ్చినా, ఒళ్లు నొప్పులు అనిపించినా వెంటనే మెడికల్ షాప్ కి వెళ్లి యాంటీబయోటిక్స్ కొనేస్తున్నారా? అయితే మీకు ప్రాణాపాయం తప్పదు..! యాంటీబయోటిక్స్‌ను విచక్షణారహితంగా వాడటం వల్ల మానవాళికి 'యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్' (AMR) అనే అదృశ్య ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు 'ఇండియన్ మెడికల్ అసోసియేషన్' (IMA) సహకారంతో దేశవ్యాప్తంగా భారీ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 

 ఏఎంఆర్.. 

సాధారణంగా శరీరంలోని హానికారక బ్యాక్టీరియాను చంపడానికి యాంటీబయోటిక్స్ వాడతాం. అయితే అవసరం లేకున్నా వాడటం లేదా డాక్టర్ చెప్పిన కోర్సును మధ్యలోనే ఆపేయడం వల్ల సదరు బ్యాక్టీరియా ఆ మందులను తట్టుకునే శక్తిని పెంచుకుంటుంది. ఫలితంగా భవిష్యత్తులో ఆ మందులు శరీరంలో పని చేయవు. చివరకు చిన్నపాటి ఇన్ఫెక్షన్లు కూడా నయం కాక ప్రాణాపాయానికి దారితీస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇప్పటికే AMRను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది.

వినూత్న కార్యక్రమాలు..

ఈ ముప్పును అరికట్టేందుకు 12 రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలోనూ వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. పాఠశాలలు, నివాస సముదాయాల్లో వైద్యులతో అవగాహన సదస్సులు నిర్వహించారు. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో భారీ ర్యాలీలు చేపట్టి ప్రజలకు 'ఏఎంఆర్' తీవ్రతను వివరించారు. తప్పుడు మందుల వినియోగం వల్ల చికిత్స విఫలమైన కేసులను ఉదహరిస్తూ నిపుణులు ప్రజలను అప్రమత్తం చేశారు. కేవలం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే యాంటీబయోటిక్స్ వాడాలని స్పష్టం చేశారు.

వైద్యులు ఏమంటున్నారంటే..? 

జలుబు, దగ్గు వంటి వైరల్ ఇన్ఫెక్షన్లకు యాంటీబయోటిక్స్ పనిచేయవు. కాబట్టి సొంత వైద్యం వద్దు. డాక్టర్ ఐదు రోజులు మందులు వాడాలని చెబితే, రెండు రోజుల్లో నయం అయిందని ఆపేయకూడదు. దీనివల్ల బ్యాక్టీరియా మందులను తట్టుకునేలా రూపాంతరం చెందుతుంది.


చేతులు శుభ్రంగా కడుక్కోవడం, శుభ్రమైన నీరు తాగడం ద్వారా ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు. తద్వారా యాంటీబయోటిక్స్ అవసరమే పడదు. ఈ రోజు మనం వాడుతున్న అనాలోచిత యాంటీబయోటిక్స్, రేపటి తరం చికిత్సకు మందులే లేకుండా చేస్తున్నాయి.

ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్‌ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.