Wellness Zone in the Sky : ఆకాశంలోనే 'వెల్నెస్ జోన్'.. సుదీర్ఘ విమాన ప్రయాణమైనా ఇక హాయిగా..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : సుదీర్ఘ విమాన ప్రయాణం అంటేనే ఒకప్పుడు అలసట, జెట్ లాగ్, ఒళ్లు నొప్పులు గుర్తొచ్చేవి. ముఖ్యంగా 20 గంటల కంటే ఎక్కువ సమయం గాలిలోనే గడపాల్సి వస్తే ప్రయాణికుల పరిస్థితి వర్ణనాతీతం. అయితే, ఈ సమస్యకు పరిష్కారంగా విమానయాన రంగంలో ఒక సరికొత్త విప్లవం రాబోతోంది. విమాన ప్రయాణంలోనూ ప్రయాణికులు ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉండేలా ఆకాశంలోనే ఒక 'వెల్నెస్ జోన్' రూపుదిద్దుకుంటోంది.

 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?

 

'ప్రాజెక్ట్ సన్‌రైజ్'.. సరికొత్త ప్రయోగం..!

ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ 'ప్రాజెక్ట్ సన్‌రైజ్' పేరుతో ఈ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన ఎయిర్‌బస్ A350-1000 ULR విమానాలను సిద్ధం చేస్తోంది. ఈ విమానాల్లో కేవలం సీట్లు మాత్రమే కాకుండా, ప్రయాణికులు తమ కండరాలకు పనిచెప్పేందుకు ప్రత్యేక వెల్నెస్ జోన్లను ఏర్పాటు చేస్తున్నారు.

వెల్నెస్ జోన్ ప్రత్యేకతలు ఇవే.. 

ప్రయాణికులకు ఇది ఒక మినీ ఫిట్‌నెస్ సెంటర్ లాంటి అనుభూతిని ఇస్తుంది. దీనిలోని ప్రధాన ఫీచర్లు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఒకే చోట కూర్చుని ఉండటం వల్ల రక్తప్రసరణ తగ్గే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ జోన్‌లో ప్రయాణికులు లేచి తిరగడానికి, తేలికపాటి వ్యాయామాలు చేయడానికి వీలుగా ఖాళీ ప్రదేశాన్ని కేటాయించారు. జెట్ లాగ్ ప్రభావాన్ని తగ్గించడానికి విమానంలో అత్యాధునిక లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇది ప్రయాణికుల శరీర జీవ గడియారానికి (Circadian Rhythm) అనుగుణంగా మారి, నిద్రలేమి సమస్యను తగ్గిస్తుంది.

హైడ్రేషన్ పాయింట్లు..

 గాలిలో తేమ తక్కువగా ఉండటం వల్ల ప్రయాణికులు త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతారు. దీనిని నివారించడానికి ఎక్కడికక్కడ హైడ్రేషన్ స్టేషన్లను అందుబాటులోకి తెస్తున్నారు.

శాస్త్రీయపరంగా.. 

ఈ వెల్నెస్ జోన్లను కేవలం విలాసం కోసం కాకుండా, నిద్ర నిపుణులు మరియు శాస్త్రవేత్తల సలహాల మేరకు రూపొందించారు. 20 గంటల తర్వాత విమానం దిగే ప్రయాణికులు అలసటగా కాకుండా, తాజాగా ఉండాలన్నదే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ సేవలు 2027 నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఒకవేళ ఇది విజయవంతమైతే, అంతర్జాతీయ విమాన ప్రయాణాల ముఖచిత్రమే మారిపోనుంది..!

 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.