వరల్డ్ ఓరల్ హెల్త్ డే ఎప్పటి నుంచి మొదలైందంటే..?  

షేర్ చేయండి:
వరల్డ్ ఓరల్ హెల్త్ డే ఎప్పటి నుంచి మొదలైందంటే..?  

సాక్షి లైఫ్ : ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం 2024: ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నారో ప్రతి ఒక్కరూ తెలుసు కోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం 2024 జరుపుకోవడం వెనుక ఉద్దేశం ఏమిటంటే..? ప్రజలకు నోటి ఆరోగ్యం, నోటి పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడమే ఈ వరల్డ్ ఓరల్ హెల్త్ డే ఉద్దేశ్యం.  
 

ఇది కూడా చదవండి.సరిగ్గా బ్రష్ చేయడానికి ఈ చిట్కాలను ఫాలో అవ్వండి.. 


ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవాన్ని జరిపేది ఎందుకంటే..?  

నోటి ఆరోగ్యం ఎందుకంటే..? దంతాలు, చిగుళ్ళు , నాలుక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే దీని ప్రభావం శరీరంలోని అన్ని అవయవాలపై పడుతుంది. అంతేకాదు మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. 
 
వరల్డ్ ఓరల్ హెల్త్ డే చరిత్ర.. 

నోటి పరిశుభ్రత గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించబడింది. 2011లో వార్షిక వరల్డ్ డెంటల్ కాంగ్రెస్ సందర్భంగా వరల్డ్ డెంటల్ ఫెడరేషన్ ఈ ఆలోచనను మొదటిసారిగా ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన ఏకగ్రీవంగా ఆమోదించడంతో 2013సంవత్సరం మార్చి 20తేదీన మొదటిసారిగా ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకున్నారు.

 ప్రాముఖ్యత..? 

పిల్లలు ,పెద్దలలో నోటి పరిశుభ్రత గురించి అవగాహన పెంచడమే ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం జరపడానికి ప్రధాన కారణం. నోటి సంబంధిత వ్యాధులకు ప్రధాన కారణాలలో జీవనశైలి, ఆహారపు అలవాట్లు ,ధూమపానం.

ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం థీమ్ 2024.. 

ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం కోసం ఒక కొత్త థీమ్ ఉంది. 'ఏ హ్యాపీ మౌత్ ఈజ్ ఏ హ్యాపీ బాడీ' థీమ్‌తో ఈ సంవత్సరం ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం 2024 ను జరుపుతున్నారు.   

  ఇది కూడా చదవండి.. దంతాల పొడవు తగ్గించడానికి ఎలాంటి చికిత్స చేస్తారు..?


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.