ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కారణంగా ఎవరు ప్రభావితమవుతారు అంటే..?
సాక్షి లైఫ్ : తెలంగాణరాష్ట్రంలోని ప్రయివేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కారణంగా అనేక రకాల వ్యాధులకు సంబంధించి చికిత్స తీసుకుంటున్న వారు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ఈ సమ్మెతో ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని చిన్న, మధ్య తరహా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న లక్షలాది మంది నిరుపేద రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. డయాలసిస్, అత్యవసర చికిత్సలు, ఆపరేషన్లు వంటి కీలక సేవలకు అంతరాయం కలగనుంది.
ఇది కూడా చదవండి.. నల్ల ఉప్పుతో ఆరోగ్య ప్రయోజనాలివే
ఇది కూడా చదవండి.. ఋతు పరిశుభ్రత దినోత్సవం చరిత్ర, ప్రాముఖ్యత..
ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
ముఖ్యంగా, అధికశాతం రోగులు ఆరోగ్యశ్రీ పథకంపైనే ఆధారపడి ఉన్న ఆసుపత్రులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గత జనవరిలోనూ ఇదే తరహాలో ప్రయివేటు ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు సేవలను నిలిపివేసి, 10 రోజుల పాటు సమ్మె చేశాయి. అప్పట్లో, ఆరోగ్యమంత్రి హామీతో సమ్మె విరమించారు. ఆ తర్వాత కూడా బిల్లుల చెల్లింపులో జాప్యం కొనసాగుతూనే ఉంది.
ప్రస్తుత చెల్లింపుల గడువు 40 రోజులు కాగా, దాదాపు 350-400 రోజులు ఆలస్యం జరుగుతోందని ఆసుపత్రులు వాపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 300పైగా ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లో ఉన్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి, పెండింగ్ బిల్లులను చెల్లించి, రోగులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రజలు, రోగుల సంఘాలు కోరుతున్నాయి.
ఇది కూడా చదవండి..నడక, పరుగు.. ఈ రెండిటిలో ఏది ఉత్తమం..?
ఇది కూడా చదవండి..న్యూరోసర్జన్లు వెన్నెముక శస్త్రచికిత్స చేయడానికి కూడా అర్హులే
ఇది కూడా చదవండి..పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన
