ప్రతిఏటా జూలై 1న డాక్టర్స్ డే ఎందుకు జరుపుకుంటారంటే..?
సాక్షి లైఫ్ : ప్రతి సంవత్సరం జూలై 1న డాక్టర్స్ డే ఎందుకు జరుపుకుంటారు, దీని వెనుక కారణం ఇదే. ప్రతి సంవత్సరం, జూలై 1వ తేదీని జాతీయ వైద్యుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఒక గొప్ప వైద్యుని జ్ఞాపకార్థం ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభమైంది. ఆయనే బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి అయిన డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్. డాక్టర్స్ డేని ప్రపంచంలోని వివిధ దేశాలలో వేర్వేరు తేదీలలో జరుపుకుంటారు, అయితే భారతదేశంలో డాక్టర్స్ డేను జూలై 1 న జరుపుకుంటారు.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ప్రాధాన్యత జాబితాలో ఆరోగ్యకరమైన జీవితం అగ్రస్థానంలో ఉంటుంది. 'ఆరోగ్యమే గొప్ప సంపద' అని కూడా చెబుతుంటారు. ఆరోగ్యవంతమైన వ్యక్తులు మాత్రమే జీవితాన్ని సరిగ్గా ఆస్వాదించగలుగుతారు. హెల్తీ గా ఉంచడంలో వైద్యుల పాత్ర చాలా ముఖ్యమైనది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్ని రకాల జబ్బులు వైద్యుల సహాయంతో నయమవుతాయి. బహుశా అందుకే డాక్టర్లకు భగవంతునితో సమానంగా చూస్తారు. ప్రసిద్ధ వైద్యుడు , బెంగాల్ రెండవ ముఖ్యమంత్రి డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ గౌరవార్థం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటారు.
భారతదేశంలో జూలై 1న మాత్రమే డాక్టర్స్ డే ఎందుకు జరుపుకుంటారు?
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో డాక్టర్స్ డేని వేర్వేరు రోజులలో జరుపుకుంటున్నప్పటికీ, భారతదేశంలో ఈ రోజును జూలై 1న జరుపుకుంటారు, ఎందుకంటే భారతదేశపు ప్రసిద్ధ వైద్యుడు డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ 1 జూలై 1882న జన్మించారు. అంతేకాదు ఆయన 1962సంవత్సరంలో జూలై 1వ తేదీనే మరణించారు. వైద్యరంగంలో వారి సేవలను గౌరవించేందుకు జూలై 1న వైద్యుల దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించారు.
డాక్టర్స్ డే జరుపుకోవడం ఉద్దేశ్యం..
వైద్యుల సహకారం, వారి పని గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం ఉద్దేశ్యం. తమ సుఖ దుఃఖాలను త్యాగం చేసి రోగుల కోసం బతుకుతున్నారు. సమాజాన్ని వ్యాధి రహితంగా ఉంచడంలో వారు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. కాబట్టి వారికి ఈ సందర్భంగా కృతఙ్ఞతలు తెలుపడంకోసమే ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం. కోవిడ్ ఇన్ఫెక్షన్ సమయంలో వారి ప్రాణాలను పట్టించుకోకుండా గంటల తరబడి నిరంతరాయంగా డ్యూటీ చేసేవారు డాక్టర్లు. అదే సమయంలో చాలా మంది వైద్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజున అటువంటి వైద్యుల త్యాగాలను గుర్తు చేసుకుంటారు.
ఇది కూడా చదవండి..ఇన్‌స్టంట్ నూడుల్స్ సైడ్ ఎఫెక్ట్స్..
వైద్యుల దినోత్సవం 2024 థీమ్..
ప్రతి సంవత్సరం డాక్టర్స్ డేని ఏదో ఒక థీమ్ తో జరుపుకుంటారు. 2024లో జాతీయ వైద్యుల దినోత్సవం థీమ్ - “హీలింగ్ హ్యాండ్స్, కేరింగ్ హార్ట్”.గతేడాదిలో ఈ దినోత్సవాన్ని "సెలబ్రేటింగ్ రెసిలెన్స్ అండ్ హీలింగ్ హ్యాండ్స్" అనే థీమ్‌తో జరుపుకున్నారు.
ఇది కూడా చదవండి.. మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
