తాజా అధ్యయనం : ఇలా చేస్తే గుండె జబ్బులు, మధుమేహం వచ్చే ప్రమాదం తక్కువ..

సాక్షి లైఫ్: భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు సర్గలేకపోవడంతోపాటు, తక్కువ శారీరక శ్రమ కారణంగా యువత కూడా డయాబెటీస్ బారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రకృతితో గడపడం ద్వారా గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం నుంచి ఉపశమనం పొందవచ్చని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

ఇది కూడా చదవండి.. ఎప్సమ్ సాల్ట్ తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?  

 డయాబెటిస్ నియంత్రించడానికి.. 

డయాబెటిస్ వంటి వ్యాధిని నియంత్రించడానికి, జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం అవసరం. అంతేకాదు కొంత సమయం ప్రకృతితో గడిపినట్లయితే, అది మీ ఆరోగ్యానికి ఒక వరం అని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ప్రకృతి అందాలను ఆస్వాదించడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం ప్రమాదం తగ్గుతుంది. అంతేకాదు వాపు వంటి సమస్యలు కూడా నయమవుతాయట. 

 నాణ్యమైన సమయాన్ని.. 

మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది.. ఇటీవల, బ్రెయిన్, బిహేవియర్ అండ్ ఇమ్యూనిటీ అనే జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం ప్రకృతిలో నాణ్యమైన సమయాన్ని గడపడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది గుండె జబ్బులు ,మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీనికి ముందు కూడా, అనేక అధ్యయనాలలో సహజసిద్దమైన ప్రకృతి శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచిదని తేలింది.

ఎంత మందిని అధ్యయనం చేశారు..?

ఈ అధ్యయనంలో 1,244 మంది పాల్గొన్నారు. వీరిలో మూత్రం, ఖాళీ కడుపు తో ఉన్నప్పుడు రక్త నమూనాలను కూడా పరిశీలించారు. ప్రకృతి ఒడిలో ఎంత సమయం గడుపుతున్నామన్నది ముఖ్యం కాదని, ఎంత నాణ్యమైన సమయాన్ని వెచ్చిస్తున్నామన్నదే ముఖ్యమని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

ఇది కూడా చదవండి.. కల్తీ ఆహారాన్ని గుర్తించడం ఎలా..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : mental-health mental-tensions diabetes heart-risk new-study heart-health heart-problems physical-health study

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com