World Unani Day 2026: వరల్డ్ యునాని డే.. ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న యునానీ వైద్యం..
సాక్షి లైఫ్ : అల్లోపతిలో ఉండే కొన్నిరకాల మందులతో సైడ్ ఎఫెక్ట్స్ ఉండడంతో చాలామంది ప్రస్తుతం ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అటువంటివాటిలో ఆయుర్వేదంతోపాటు వేల ఏళ్ల చరిత్ర కలిగిన యునానీ వైద్యం నేడు శాస్త్రీయ ఆధారాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రముఖ యునానీ వైద్యనిపుణులు, సామాజిక సంస్కర్త హకీం అజ్మల్ ఖాన్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఫిబ్రవరి 11వతేదీన వరల్డ్ యునానీ డే ని నిర్వహిస్తుంటారు.
వరల్డ్ యునానీ డే 2026..
ఈసారి "యునానీ ప్రాక్టీస్‌లో ఆవిష్కరణలు, ఆధారిత చికిత్స" (Innovation and Evidence in Unani Practice) అనే ప్రత్యేక నినాదంతో వరల్డ్ యునానీ డే జరుపుతున్నారు. యునానీ వైద్యం కేవలం రోగాన్ని తగ్గించడం మాత్రమే కాకుండా, మనిషి శరీర తత్వాన్ని (మిజాజ్) బట్టి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడంపై దృష్టి పెడుతుంది. ఇబ్న్ సీనా, హకీం అజ్మల్ ఖాన్ వంటి మహానుభావులు వేసిన పునాదులపై నేడు ఆధునిక యునానీ వైద్యం నిలబడింది. చికిత్స కంటే నివారణే మిన్న అనే సూత్రాన్ని నమ్మే యునానీ వైద్యం నేడు ప్రపంచవ్యాప్తంగా తన ప్రత్యేకతను చాటుకుంటోంది. .
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
యునానీ వైద్యం.. శాస్త్రీయ ఆధారిత చికిత్సలు..
ప్రకృతి సిద్ధమైన వనమూలికలతో వ్యాధులను మూలాల నుంచి నయం చేయడంలో యునానీ విధానం విశిష్టమైనది. ప్రపంచ యునానీ దినోత్సవం 2026 సందర్భంగా శాస్త్రీయ ఆధారిత చికిత్సలు, కొత్త ఆవిష్కరణలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ సాగుతోంది.
యునానీ విధానంలో.. మనం తీసుకునే ఆహారం, జీవనశైలి మార్పుల ద్వారానే సగం రోగాలను నయం చేయవచ్చని యునానీ వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం ఈ వైద్యంలోకి కృత్రిమ మేధ (AI) వంటి సాంకేతికతను జోడించి, క్లినికల్ పరీక్షల ద్వారా సురక్షితమైన వైద్యం అందిస్తున్నారు.
ఈ ఏడాది థీమ్ పురాతన జ్ఞానాన్ని నేటి ఆధునిక శాస్త్ర సాంకేతికతతో అనుసంధానించడమే లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం అనుభవ వైద్యం కాకుండా, ప్రతి చికిత్సకూ శాస్త్రీయ ఆధారాన్ని (Evidence) చూపడంపై నిపుణులు మొగ్గు చూపుతున్నారు.
ముంబై వేదికగా అంతర్జాతీయ సదస్సు..
యునానీ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని 'సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యునానీ మెడిసిన్' (CCRUM) ఫిబ్రవరి 14, 15 తేదీల్లో అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తోంది. ఈ సదస్సును ముంబైలో ప్రత్యక్షంగానూ, ఆన్‌లైన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగానూ నిర్వహించనున్నారు. ప్రధానాంశాలు: సరికొత్త ఔషధ తయారీ విధానాలు, పరిశోధనల్లో అత్యాధునిక సాంకేతికత వినియోగం, దీర్ఘకాలిక వ్యాధుల నివారణలో యునానీ పాత్రపై నిపుణులు చర్చించనున్నారు.
ఎంతో అవసరం..
ప్రస్తుత కాలంలో పెరుగుతున్న జీవనశైలి వ్యాధులు అంటే షుగర్, బి.పి వంటి దీర్ఘకాలిక సమస్యలకు యునానీలో సురక్షితమైన పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయి. ఆహార నియమాలు, వ్యాయామం, జీవనశైలి మార్పుల ద్వారా వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. మొక్కలు, ఖనిజాల నుంచి సేకరించిన సహజ సిద్ధమైన మూలకాలతో చికిత్స ఉంటుంది కాబట్టి దుష్ప్రభావాలు (Side effects) తక్కువ.
డబ్ల్యూహెచ్‌ఓ (WHO)..
డబ్ల్యూహెచ్‌ఓ (WHO) వంటి సంస్థలు సైతం సంప్రదాయ వైద్యంలో భారత్ చేస్తున్న పరిశోధనలను అభినందిస్తున్నాయి. యునానీ వైద్యం కేవలం మందులకు సంబంధించింది కాదు.. అది ప్రకృతిలో లభించే సహజసిద్ధమైన మూలికల ద్వారా చికిత్స అందిస్తారు. నేటి ఆధునిక వైద్యంతో దీన్ని జోడించడం వల్ల ప్రజారోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని వైద్యనిపుణులు అంటున్నారు.
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
