XEC virus : 27 దేశాలలో కోవిడ్ న్యూ వేరియంట్..  

షేర్ చేయండి:
XEC virus : 27 దేశాలలో కోవిడ్ న్యూ వేరియంట్..  

సాక్షి లైఫ్ : ఐరోపాలో కోవిడ్ కొత్త వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. ఈ కొత్త వేరియంట్ కు "గ్జెక్ వైరస్ " అని పేరుపెట్టారు. ఈ కోవిడ్ న్యూ వేరియంట్ ను మొదటిసారి జూన్‌లో జర్మనీలో కనుగొన్నారు. యూకే, డెన్మార్క్ వంటి యూరోపియన్ దేశాలతో పాటు, యునైటెడ్ స్టేట్స్లో కూడా ఈ కొత్తరకం వేరియంట్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఇది త్వరలో ఈ వేరియంట్ మెయిన్ స్ట్రెయిన్ గా మారుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 ఇది కూడా చదవండి..పీఎం నరేంద్ర మోడీ ఆరోగ్య రహస్యాలు.. 

ఇది కూడా చదవండి..ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎలాంటి ఆహారాల నుంచి పొందవచ్చు..?

ఇది కూడా చదవండి..తేనెను ఫ్రిజ్‌లో ఉంచుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి.. 

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

మునుపటి సబ్-వేరియంట్‌ల కంటే..  

 కొత్త వేరియంట్, ఓమిక్రాన్ వేరియంట్ కంటే "గ్జెక్" వేరియంట్ మరింత విస్తరించే అవకాశం ఉంది. దీనికి దోహదపడే వేరియంట్‌లో కొన్ని కొత్త మ్యుటేషన్‌లు వచ్చినట్లు ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. అయితే వ్యాక్సిన్‌లు ఇలాంటి కేసులు తీవ్రంగా పెరగకుండా నిరోధించడంలో సహాయపడతాయని నిపుణులు సూచిస్తున్నారు.

 గ్జెక్ వేరియంట్ అనేది మునుపటి ఒమైక్రాన్ సబ్-వేరియంట్‌ల KS.1.1 , KP.3.3 హైబ్రిడ్, ఇవి ప్రస్తుతం ఐరోపాలో తీవ్రంగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు, పోలాండ్, నార్వే, లక్సెంబర్గ్, పోర్చుగల్, చైనాతో సహా 27 దేశాల నుంచి 500 నమూనాల్లో గ్జెక్ వైరస్ ఉనికిని గుర్తించినట్లు నివేదికలు చెబుతున్నాయి. కోవిడ్ కొత్త వేరియంట్ డెన్మార్క్, జర్మనీ, యుకె, నెదర్లాండ్స్‌లో మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గ్జెక్ వైరస్ కోవిడ్ వేరియంట్‌ల కంటే ఎక్కువగా వ్యాప్తి చెందగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయితే టీకాల ద్వారా రక్షణ కల్పించవచ్చని, దీనిగురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పరిశోధకులు చెబుతున్నారు. ఐతే శీతాకాలంలో గ్జెక్ ఒక బలమైన సబ్‌వేరియంట్‌గా మారవచ్చు అని యూనివర్సిటీ కాలేజ్ లండన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఫ్రాంకోయిస్ బలౌక్స్ అంటున్నారు.

ఇది కూడా చదవండి..జీర్ణశయాంతర క్యాన్సర్స్ ఎన్నిరకాలు..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.