జీర్ణశయాంతర క్యాన్సర్స్ ఎన్నిరకాలు..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ ఆరోగ్యకరమైన జీవితానికి చాలా ముఖ్యం. మన ఆరోగ్యం విషయంలో జీర్ణక్రియ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే మారుతున్న జీవనశైలి కారణంగా మనుషుల ఆహారపు అలవాట్లు కూడా వేగంగా మారుతున్నాయి. అటువంటి పరిస్థితిలో, జీర్ణవ్యవస్థ గురించి అవగాహన క ఎంతైనా అవసరం. 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనలకు బెస్ట్ సొల్యూషన్ 

ఇది కూడా చదవండి..సైనసిటిస్ ఎన్నిరకాలున్నాయంటే..?

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

ఆరోగ్యకరమైన జీవితం కోసం, మన జీర్ణవ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉండాలి. అయితే, వేగంగా మారుతున్న జీవనశైలి కారణంగా, ప్రజల జీర్ణవ్యవస్థ క్షీణిస్తోంది. ఈ అలవాట్ల కారణంగానే మొత్తం జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. మన జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటేనే, అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు మనకు దూరంగా ఉంటాయి, ఒకవేళ జీర్ణవ్యవస్థ దెబ్బతింటే మన ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. 

జీర్ణశయాంతరవ్యాధుల గురించి ప్రజలకు అవగాహన చాలా అవసరం. ఇది ఆరోగ్యం గురించి మెరుగైన నిర్ణయాలు తీసుకోవడంలో ప్రజలకు సహాయపడుతుంది. ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా అనేక జీర్ణశయాంతర సమస్యలు తలెత్తుతున్నాయి. క్యాన్సర్ వీటిలో ఒకటి. ఇది ప్రాణాంతకం కూడా కావచ్చు. జీర్ణశయాంతరవ్యాధుల గురించి తప్పనిసరిగా తీసుకోవాలి.. వీటిలో కొన్ని ప్రాణాంతకమైన క్యాన్సర్ లు కూడా ఉన్నాయి. 

కొలొరెక్టల్ క్యాన్సర్..  
 
కొలొరెక్టల్ క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా మూడవ అత్యంత సాధారణ క్యాన్సర్. పెద్దప్రేగు లేదా పురీషనాళాన్ని ప్రభావితం చేస్తుంది. స్క్రీనింగ్ చేసి ముందస్తుగా గుర్తించడం ద్వారా ఆయా సమస్య నుంచి బయట పడొచ్చు. కానీ ఒక్కోసారి కొలొరెక్టల్ క్యాన్సర్ వస్తే, చికిత్స చేయడం సవాలుగా ఉంటుంది.

పెద్దప్రేగు క్యాన్సర్.. 

ఈ రకమైన క్యాన్సర్ వృద్ధులలో సర్వసాధారణం. కేవలం వృద్దులలోనే కాకుండా యువకుల్లో కూడా ఈ మహమ్మారి వస్తోంది. స్టమక్ క్యాన్సర్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్య ఎక్కువ ఉంది.

కాలేయ క్యాన్సర్..  

కాలేయ క్యాన్సర్, ముఖ్యంగా హెపాటోసెల్లర్ కార్సినోమా (హెచ్ సిసి) నిర్ధారణ అయినప్పుడు, కొన్ని చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. సిర్రోసిస్, నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, హెపటైటిస్ బి లేదా సి వంటి దీర్ఘకాలిక కాలేయ వ్యాధులు లివర్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.

అన్నవాహిక క్యాన్సర్..  

ఎసోఫాగియల్ క్యాన్సర్. ధూమపానం, అధిక మద్యపానం వంటివి అన్నవాహికకు సంబంధించిన వ్యాధులకు కారణమవుతున్నాయి. ఇవే  అన్నవాహిక క్యాన్సర్‌కు ప్రధాన ప్రమాద కారకాలుగా మారుతున్నాయి.

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్.. 

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చికిత్సకు సవాలుగా ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమైందేకాక, ప్రాణాంతకమైంది కూడా. సాధారణంగా ఈ క్యాన్సర్ ముదిరే వరకు దాని లక్షణాలు కనిపించకపోవడమే దీనికి ప్రధాన కారణం.

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..

ఇది కూడా చదవండి..అమెరికాలో కొత్త వ్యాధి.. నేరుగా మెదడుపై ప్రభావం..

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.