Medical Tourism Hubs: మెడికల్ టూరిజంలో సరికొత్త హబ్స్ .. 2047 లక్ష్యంగా వడివడిగా అడుగులు..!

సాక్షి లైఫ్ : ఒకప్పుడు అంటువ్యాధులతో అల్లాడిన దేశం.. నేడు ప్రపంచానికే ‘ఔషధ భాండాగారం’గా అవతరించింది. సమ్మిళిత అభివృద్ధి, ఆధునిక సాంకేతికత, పటిష్టమైన మౌలిక సదుపాయాలతో భారత ఆరోగ్య రంగం మునుపెన్నడూ లేని రీతిలో దూసుకుపోతోంది. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనలో భాగంగా.. పేదవాడికి సైతం కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

 

ఆయుష్మాన్ భారత్..

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆరోగ్య పథకమైన ‘ఆయుష్మాన్ భారత్’ కోట్లాది కుటుంబాలకు ధీమానిస్తోంది. పీఎం-జేఏవై (PM-JAY):. ఏటా రూ. 5 లక్షల వరకు ఉచిత నగదు రహిత చికిత్సను అందిస్తూ, ఇప్పటివరకు 43 కోట్లకు పైగా ఆయుష్మాన్ కార్డులను పంపిణీ చేశారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేయడం మరో చారిత్రాత్మక మైలురాయి.

 గత ఏడాదిలో (2024-25) సామాన్య కుటుంబాలకు సుమారు రూ. 1.25 లక్షల కోట్ల వైద్య ఖర్చులు ఆదా అయ్యాయి. తాజా బడ్జెట్‌లో (2026-27) ఈ పథకానికి నిధులను రూ. 9,500 కోట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు.. 

గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యాన్ని బలోపేతం చేసేందుకు దేశవ్యాప్తంగా 1.84 లక్షల ‘ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను’ ఏర్పాటు చేశారు. మారుమూల ప్రాంతాల ప్రజలు నిపుణులైన వైద్యులను సంప్రదించేలా ఇప్పటివరకు 42.6 కోట్ల టెలి-కన్సల్టేషన్లు నిర్వహించారు.

 కేవలం చికిత్సకే పరిమితం కాకుండా.. యోగా సెషన్లు, బీపీ, షుగర్ వంటి వ్యాధుల ముందస్తు పరీక్షల ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడుతున్నారు.

ఫార్మా రంగం.. 

ప్రపంచవ్యాప్తంగా సరఫరా అవుతున్న జనరిక్ మందుల్లో 20 శాతం భారత్ నుంచే వెళ్తున్నాయి. యూనిసెఫ్ (UNICEF) వినియోగించే వ్యాక్సిన్లలో 60 శాతం మన దేశమే అందిస్తుండటం గమనార్హం. 2030 నాటికి భారత బయో-ఎకానమీ విలువ 300 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా.

మెడికల్ టూరిజంలో సరికొత్త హబ్..

భారతీయ వైద్యంపై అంతర్జాతీయంగా నమ్మకం పెరుగుతోంది. 2009లో కేవలం లక్షగా ఉన్న మెడికల్ టూరిస్టుల సంఖ్య, 2024 నాటికి 6 లక్షలకు పైగా పెరిగింది. దీనిని మరింత ప్రోత్సహించేందుకు ప్రైవేటు భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా ఐదు ఇంటిగ్రేటెడ్ మెడికల్ హబ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

భవిష్యత్తుపై భరోసా..

డ్రోన్ల ద్వారా మందుల పంపిణీ, ఏఐ (AI) ఆధారిత రోగ నిర్ధారణ పరీక్షలు, సొంతంగా రూపొందించిన టీకాలు నేడు భారత ఆరోగ్య ముఖచిత్రాన్ని మారుస్తున్నాయి. ‘అందరికీ ఆరోగ్యం’ అనే నినాదం కాగితాలకే పరిమితం కాకుండా.. క్షేత్రస్థాయిలో అమలవుతూ భారత్‌ను అంతర్జాతీయ వేదికపై అగ్రస్థానంలో నిలబెడుతోంది.

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : medical-research medical-tourism-india india-medical-tourism-2047 medical-tourism-growth
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com