ఆయుష్షు రహస్యాలను గురించి చెప్పిన 111ఏళ్ల వృద్ధుడు..    

సాక్షిలైఫ్ : ప్రపంచంలోనే అత్యంత ఎక్కువకాలం జీవించి ఓ 111ఏళ్ల వృద్ధుడు సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. జీవించి ఉన్న వృద్ధుడిగా అరుదైన గుర్తింపు పొందడమే కాకుండా గిన్నిస్ బుక్ సరికొత్త రికార్డును దక్కించుకున్నాడు. 111 ఏళ్ల ఇంగ్లండ్ నివాసి జాన్ ఆల్ఫ్రెడ్ టిన్నిస్‌వుడ్‌ ఈ రికార్డును సాధించారు. ఇంతకుముందు ఈ రికార్డు ఏప్రిల్ ప్రారంభంలో మరణించిన వెనిజులాకు చెందిన 114 ఏళ్ల వ్యక్తి పేరిట ఉంది.

ఎక్కువ కాలం జీవించిన వ్యక్తిగా రికార్డు..
 
ఇంగ్లండ్‌కు చెందిన జాన్‌ ఆల్‌ఫ్రెడ్‌ టిన్నిస్‌వుడ్‌ను గిన్నిస్ బుక్‌ సంస్థ అతన్ని ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా అధికారికంగా ప్రకటించింది. అతని వయస్సు 111 సంవత్సరాల 224 రోజులు. "జాన్‌ ఆల్‌ఫ్రెడ్‌ టిన్నిస్‌వుడ్‌" పేరు గిన్నిస్ బుక్‌లో నమోదైంది. అతను ఎక్కువ కాలం జీవించిన వ్యక్తిగా రికార్డు దక్కించుకున్నాడు. అంతకుముందు ఈ రికార్డు వెనిజులాకు చెందిన 114 ఏళ్ల జువాన్ విసెంటె పెరెజ్ పేరిట ఉంది.  అతను కొన్ని రోజుల క్రితం మరణించాడు. జువాన్ మరణం తర్వాత, ఈ రికార్డు జపాన్‌కు చెందిన 112 ఏళ్ల గిసాబురో సోనోబ్‌కి దక్కుతుందని అనుకున్నారు. కానీ గిన్నిస్ బుక్ టీమ్ వెతకగా అతను మార్చి 31న చనిపోయాడని తేలింది.

  ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?


 టైటానిక్‌ షిప్ మునిగిన సంవత్సరం కూడా.. 

 "జాన్‌ ఆల్‌ఫ్రెడ్‌ టిన్నిస్‌వుడ్‌" 1912 ఆగస్టు 26న లివర్‌పూల్‌లో జన్మించాడు. టైటానిక్‌ షిప్ మునిగిన సంవత్సరం కూడా ఇదే. జాన్ ఖచ్చితమైన వయస్సు 5 ఏప్రిల్ 2024 నాటికి 111 సంవత్సరాల 223 రోజులు. 111 సంవత్సరాల వయస్సులో, జాన్ ప్రస్తుతం సౌత్‌పోర్ట్‌లోని సంరక్షణ గృహంలో నివసిస్తున్నారు. గిన్నిస్‌బుక్ టీమ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్‌ ఆల్‌ఫ్రెడ్‌ టిన్నిస్‌వుడ్‌ మాట్లాడుతూ, 'ఎక్కువ కాలం జీవించడం లేదా తక్కువ కాలం జీవించడం అనేది మన చేతుల్లో ఉండదని, కానీ అందుకోసం అతిగా తినకూడదు, అతిగా వ్యాయామాలు చేసి కొత్త సమస్యలు తెచ్చుకోవద్దని సూచించాడు. తనకు ఎప్పుడైనా ఒక్కసారి మద్యం సేవిస్తానని, దూమపానం చేయనని తెలిపాడు. తాను ఎక్కువకాలం బతకడానికి అదృష్టం కూడా ఓ కారణమని జాన్ పేర్కొన్నాడు. 
 

సిగరెట్ తాగవద్దు.. 

ప్రతి శుక్రవారం జాన్ చేపలు, చిప్స్ తింటాడు. తాను ఎలాంటి ప్రత్యేక ఆహారాన్ని పాటించడం లేదని, 'తనకు పెట్టిందే తింటానని, తనకంటూ ప్రత్యేకమైన ఆహారం లేదని చెప్పారు. ఎక్కువకాలం జీవించాలంటే అన్ని విషయాలలో సంయమనం పాటించాలని ఆయన చెబుతున్నారు. 'అతిగా తాగినా, తిన్నా, ఎక్కువ నడిచినా నష్టమే" అని, ఎవరైనా అతిగా ఏమీ చేయకూడదు." అని జాన్ వెల్లడించాడు. జాన్ తన జీవితంలో కరోనా మహమ్మారి  నుంచి ఇన్ఫ్లుఎంజా వరకు రెండు ప్రపంచ యుద్ధాలను కూడా చూశాడు.


జాన్ తన పనులన్నీ తానే..  

జాన్ జీవించి ఉన్న అత్యంత వృద్ధిడిగా నిర్ధారించిన తర్వాత, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక న్యాయనిర్ణేత మేగాన్ బ్రూస్ సౌత్‌పోర్ట్‌ను సందర్శించి జాన్‌కు సర్టిఫికేట్‌ను అందించారు. అతని సుదీర్ఘ జీవితం గురించి మరింత తెలుసుకున్నారు. 111 సంవత్సరాల వయస్సు ఉన్నప్పటికీ, జాన్ తన రోజువారీ పనులను చాలా వరకు స్వయంగా చేసుకోగలుగు తున్నాడు. ఎవరి సహాయం లేకుండానే మంచం మీద నుంచి లేవగలుగుతాడు. అతను వార్తలు వినడానికి రేడియోని వినియోగిస్తాడు. ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ వయస్సు 117 ఏళ్లు. ఆమె పేరు మరియా బ్రన్యాస్ మోరేరా. స్పెయిన్‌లో నివసిస్తోంది.  

ఇది కూడా చదవండి.. ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే కారకాలు

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : world old-age longevity-secrets 111-year-old john-tinniswood john-alfred-tinniswood the-guinness-book-of-records guinness-book world-book-of-record
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com