సాక్షి లైఫ్ : దేశంలోని ఆడబిడ్డల ఆరోగ్య సంరక్షణలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. మహిళలను వేధిస్తున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (Cervical Cancer) మహమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. రాజస్థాన్‌లోని అజ్మీర్ వేదికగా 14 ఏళ్ల బాలికల కోసం దేశవ్యాప్త హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐదుగురు బాలికలకు టీకాలు అందించి ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..New Guidelines : శరీరానికి అవసరమయ్యే నీటి పరిమాణంలో కొత్త మార్గదర్శకాలు..
ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?
ఆడబిడ్డల ఆరోగ్యమే ప్రభుత్వ ప్రాధాన్యం..
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మహిళల చిన్నపాటి సమస్యలను పరిష్కరించడమే బీజేపీ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. "మహిళలే ప్రతి ఇంటికి వెన్నెముక. వారి ఆరోగ్యం బాగుంటేనే దేశం బాగుంటుంది. 2014 నుంచి మా ప్రభుత్వం మహిళా సాధికారత కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది. ఈ హెచ్‌పివి టీకా కార్యక్రమం మహిళల ఆత్మగౌరవాన్ని, ఆరోగ్యాన్ని కాపాడే దిశగా మరో ముందడుగు," అని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికార కాంక్షతో కాకుండా.. సేవా దృక్పథం, సున్నితత్వంతో పనిచేస్తుందని మోదీ పునరుద్ఘాటించారు.
ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com