New Guidelines : శరీరానికి అవసరమయ్యే నీటి పరిమాణంలో కొత్త మార్గదర్శకాలు..
సాక్షి లైఫ్ : ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం 8 గ్లాసులు అంటే సుమారు 2 లీటర్లు నీళ్లు తాగాలనేది దశాబ్దాలుగా వస్తున్న సూచన. అయితే, ఈ సూత్రం గతంలో అందరికీ వర్తించేది. ఇప్పుడు ఆయా మార్గదర్శకాలు మారాయని నిపుణులు చెబుతున్నారు. మారుతున్న జీవనశైలి, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా శరీరానికి అవసరమయ్యే నీటి పరిమాణం వ్యక్తిని బట్టి మారుతుందని ఐసీఎంఆర్ (ICMR) అండ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?
కొత్త మార్గదర్శకాలు ఇవే..
భారతీయ వాతావరణం, శ్రమను దృష్టిలో ఉంచుకుని నిపుణులు తాజా అంచనాలను విడుదల చేశారు.పురుషులకు రోజుకు సుమారు 3.7 లీటర్ల ద్రవ పదార్థాలు అవసరం. మహిళలకురోజుకు సుమారు 2.7 లీటర్ల ద్రవ పదార్థాలు సరిపోతాయి. ఇక్కడ ద్రవ పదార్థాలు అంటే కేవలం మంచినీరు మాత్రమే కాదు. మనం తాగే పాలు, కాఫీ, టీ, మజ్జిగతో పాటు పండ్లు, కూరగాయల ద్వారా శరీరానికి అందే నీరు కూడా ఇందులో భాగమేనని నిపుణులు వెల్లడిస్తున్నారు.
మీ శరీరం ఏం చెబుతోంది అంటే..?
బలవంతంగా లీటర్ల కొద్దీ నీళ్లు తాగడం వల్ల రక్తంలో లవణాల స్థాయి తగ్గి ఇబ్బందులు తలెత్తవచ్చు. అందుకే 'దాహం' వేసినప్పుడు నీళ్లు తాగడమే అత్యంత సహజమైన మార్గమని వైద్యులు సూచిస్తున్నారు.
మీరు సరిగ్గా నీళ్లు తాగుతున్నారా? లేదా అనేది ఇలా తెలుసుకోండి..మీ శరీరంలో నీటి శాతం సరిగ్గా ఉందో లేదో మీ మూత్రం రంగును బట్టి గుర్తించవచ్చు. మూత్రం లేత పసుపు రంగులో ఉంటే మీ శరీరం సరైన హైడ్రేషన్‌లో ఉంది. ముదురు పసుపులో ఉంటే మీరు తగినంత నీరు తాగడం లేదని అర్థం చేసుకోవాలి. నారింజ, గోధుమ రంగులో ఉంటే ఇది తీవ్రమైన నిర్జలీకరణ (Dehydration) లక్షణం. వెంటనే నీళ్లు తాగాలని సూచనగా భావించాలి.
గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయాలు..
కీరదోస, పుచ్చకాయ వంటి పండ్లలో 90శాతం వరకు నీరే ఉంటుంది. వీటిని డైట్‌లో చేర్చుకోవడం వల్ల శరీరం తాజాగా ఉంటుంది. ఎండలో శ్రమించే వారికి, ఏసీ గదుల్లో కూర్చుని పని చేసే వారికంటే ఎక్కువ నీరు అవసరమవుతుంది. టార్గెట్లు పెట్టుకుని మరీ నీళ్లు తాగడం కంటే, మీ శరీర తత్వాన్ని బట్టి తాగడం ఉత్తమం.
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
