The Indian Medical Association Objects : ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై ఐఎంఏ అభ్యంతరం..! ఆయుర్వేద సర్జరీలపై ఆగ్రహం.. 

సాక్షి లైఫ్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఒక ఉత్తర్వు ఇప్పుడు అల్లోపతి,ఆయుర్వేద వైద్య వర్గాల మధ్య చిచ్చు పెట్టింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయుర్వేద వైద్యులు 58 రకాల శస్త్రచికిత్సలను స్వతంత్రంగా నిర్వహించవచ్చని ప్రభుత్వం అనుమతించడమే దీనికి కారణం.

ఇది కూడా చదవండి.. చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు.. 

ఇది కూడా చదవండి.. లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి.. కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

 

ప్రధానికి ఫిర్యాదు చేసే యోచన.. 

ఆయుర్వేదాన్ని దాని స్వచ్ఛమైన రూపంలో తాము గౌరవిస్తామని, కానీ శాస్త్రీయత లేని విధంగా వైద్య విధానాలను కలపడం వెనకడుగు వేయడమేనని The Indian Medical Association (ఐఎంఏ) విమర్శించింది. ఈ ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, ప్రధాన మంత్రికి వినతి పత్రం అందజేయ నున్నట్లు సంఘం వెల్లడించింది. ఈ వివాదంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. రోగుల భద్రతే పరమావధిగా వైద్య విధానాల్లో స్పష్టత ఉండాలని నిపుణులు కోరుతున్నారు.


'మిక్సోపతీ'తో ముప్పు..!

ప్రభుత్వ నిర్ణయాన్ని ‘హిమాలయన్ బ్లండర్’ అంటే పెద్ద తప్పిదంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అభివర్ణించింది. ఆధునిక వైద్యం (Allopathy) సంప్రదాయ వైద్య విధానాలను కలపడం (Mixopathy) వల్ల వినాశకరమైన పరిణామాలు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది.

ఐఎంఏ లేవనెత్తిన ప్రధానాంశాలు ఏమిటంటే..? 
 
శస్త్రచికిత్స చేయాలంటే మానవ శరీర నిర్మాణ శాస్త్రం, ఫిజియాలజీ, అనస్థీషియాపై దశాబ్ద కాలం పైగా కఠినమైన శిక్షణ అవసరం. అటువంటి శిక్షణ లేని వారికి సర్జికల్ బ్లేడ్లు ఇవ్వడం రోగుల ప్రాణాలకు ముప్పు అని ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ దిలీప్ పి భానుశాలి పేర్కొన్నారు.

అనుమతి ఇచ్చిన 58 రకాల సర్జరీలలో అపెండిసైటిస్, హెర్నియా, కంటి శుక్లాల (Cataract) వంటి క్లిష్టమైన ఆపరేషన్లు ఉన్నాయి. శస్త్రచికిత్స అంటే కేవలం కోత కోయడం మాత్రమే కాదని, ఆపరేషన్ తర్వాత వచ్చే సమస్యలను (Post-operative complications) ఎదుర్కోవడం కూడా కీలకమని సంఘం స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

Tags : surgery allopathy-medicine ayurvedic-medicine ayurveda-treatment indian-healthcare india-climate-strategy andhra-pradesh-health-news ap-government-decision ima-objection the-indian-medical-association medical-association
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com