Lung Health : మీకు వచ్చే దగ్గు ఏ రకమో తెలుసుకోండి.. 

షేర్ చేయండి:
Lung Health : మీకు వచ్చే దగ్గు ఏ రకమో తెలుసుకోండి.. 

సాక్షి ల్లైఫ్ : మారుతున్న వాతావరణం, కాలుష్యం కారణంగా ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య దగ్గు. అయితే దగ్గు రాగానే ఏదో ఒక సిరప్‌ వాడటం కంటే, అది ఏ రకమైన దగ్గు అనేది గుర్తించడం ముఖ్యం. దగ్గులో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి: తడి దగ్గు (Wet Cough), పొడి దగ్గు (Dry Cough). వీటి మధ్య తేడాలు, కారణాలు ,జాగ్రత్తలపై ప్రత్యేక కథనం.

 

ఇది కూడా చదవండి..China’s New Longevity Pill : ఆయువు పెంచే చైనా ఔషధంతో 150 ఏళ్లు బతకొచ్చా..?

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..

 

రకాన్ని బట్టి కారణాలు..

పొడి దగ్గు..ఇందులో కఫం రాదు. గొంతులో ఇరిటేషన్ గా, అసౌకర్యంగా ఉంటుంది. ఇది సాధారణంగా అలెర్జీలు, ఆస్తమా, యాసిడ్ రిఫ్లక్స్ (ఎసిడిటీ), ధూమపానం లేదా గాలిలో పొడిదనం వల్ల వస్తుంది. కొన్నిసార్లు వాడే మందుల వల్ల కూడా పొడి దగ్గు రావచ్చు.


తడి దగ్గు..దగ్గినప్పుడు శ్లేష్మం లేదా కఫం వస్తుంది. శరీరంలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఊపిరితిత్తులు, శ్వాసనాళాలు అధికంగా శ్లేష్మాన్ని ఉత్పత్తి చేస్తాయి. జలుబు, ఫ్లూ, బ్రోన్కైటిస్, న్యుమోనియా వంటి సమస్యలు దీనికి ప్రధాన కారణాలు.

ఉపశమనానికి ఇంటి చిట్కాలు..

దగ్గు తీవ్రతను తగ్గించడంలో కొన్ని సహజ మార్గాలు అద్భుతంగా పనిచేస్తాయి. గోరువెచ్చని పానీయాలు..తరచుగా వేడి నీరు, హెర్బల్ టీ లేదా సూప్‌లు తీసుకోవడం వల్ల గొంతుకు ఉపశమనం లభిస్తుంది. తేనె గొంతులోని ఇరిటేషన్ ను తగ్గించి, దగ్గును అదుపు చేస్తుంది. ఆవిరి పట్టడం.. ముక్కు దిబ్బడ, గొంతులో పేరుకుపోయిన కఫం వదలడానికి ఆవిరి పట్టడం అనేది సరైన పరిష్కార మార్గం. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా తగినంత నీరు తాగుతూ ఉండాలి.

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి..?

దగ్గు మూడు వారాల కంటే ఎక్కువగా వేధిస్తున్నా.., శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా పిల్లికూతలు వస్తున్నా..,దగ్గుతో పాటు జ్వరం, ఛాతీ నొప్పి ఉన్నా.. కఫంలో రక్తం కనిపించినా.. దగ్గు సాధారణమే అని నిర్లక్ష్యం చేయకూడదు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని కలవాలి. 

నివారణే మార్గం.. 

చేతులను ఎప్పటికప్పుడు సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. అంతే కాకుండా దగ్గుతున్నప్పుడు లేదా తుమ్మినప్పుడు చేతులకు బదులుగా టిష్యూ లేదా మోచేయిని అడ్డు పెట్టుకోవాలి. తరచుగా కళ్లు, ముక్కు, నోటిని తాకకుండా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్లు వ్యాపించకుండా అడ్డుకోవచ్చు.

 

ఇది కూడా చదవండి.. ఎక్కిళ్లు రావడానికి కారణాలు..? నివారణా చిట్కాలు..   

ఇది కూడా చదవండి..సైనసిటిస్ ఎన్నిరకాలున్నాయంటే..?

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

 ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు.. 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.