Dengue : ప్రాణాంతక  డెంగ్యూను అంతమొందించే సరికొత్త ఔషధం..!

షేర్ చేయండి:
Dengue : ప్రాణాంతక  డెంగ్యూను అంతమొందించే సరికొత్త ఔషధం..!

సాక్షి లైఫ్ : ప్రతి ఏటా వందలాది మంది ప్రాణాలు తీస్తున్న డెంగ్యూ మహమ్మారికి చెక్ పెట్టేందుకు శాస్త్రవేత్తలు శ్రీకారం చుట్టారు. 'ఒంటె' రోగనిరోధక వ్యవస్థలో ఉండే ప్రత్యేక శక్తే ఇప్పుడు డెంగ్యూ బాధితులకు సంజీవనిగా మారబోతోంది. సాధారణంగా డెంగ్యూ వైరస్‌లో నాలుగు రకాలు (సెరోటైప్స్) ఉంటాయి. ఒక రకానికి చికిత్స అందిస్తే మరో రకం వైరస్ దాడి చేసే అవకాశం ఉంది. అయితే, ఒంటెలు, లామాలు వంటి జంతువుల శరీరంలో ఉత్పత్తి అయ్యే 'నానో బాడీస్' (Nano-bodies) ఈ నాలుగు రకాల వైరస్‌లను సమర్థవంతంగా ఎదుర్కోగలవని పరిశోధకులు గుర్తించారు.

ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

 

ప్రత్యేకత..?

మానవ శరీరంలోని ప్రతిరక్షకాలు (Antibodies) పరిమాణంలో పెద్దవిగా ఉండి, వైరస్‌లోని అన్ని భాగాలను చేరుకోలేవు. కానీ ఒంటెల నుంచి సేకరించే ఈ నానో బాడీలు చాలా సూక్ష్మంగా ఉంటాయి. ఇవి వైరస్ కణాల లోపలికి చొచ్చుకుపోయి, అవి వృద్ధి చెందకుండా అడ్డుకుంటాయి.

పరిశోధనలోని ముఖ్యాంశాలు.. 

డెంగ్యూలోని అన్ని వేరియంట్లపై ఈ విరుగుడు ఒకేలా పనిచేస్తుంది. ఇతర మందులతో పోలిస్తే వీటి తయారీ సులభం, తక్కువ ఖర్చుతో కూడుకున్నది. సహజసిద్ధమైన ప్రోటీన్ల ద్వారా వీటిని తయారు చేయడం వల్ల మానవ శరీరంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం తక్కువ. ప్రస్తుతం ఈ పరిశోధనలు ప్రయోగశాల దశలో ఉన్నాయి. ఇవి విజయవంతమైతే, త్వరలోనే డెంగ్యూ మరణాలకు చరమగీతం పాడే శక్తివంతమైన యాంటీడోట్ అందుబాటులోకి రానుంది.

 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..New Guidelines : శరీరానికి అవసరమయ్యే నీటి పరిమాణంలో కొత్త మార్గదర్శకాలు..

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.