Cooking Oils : వంటకు వాడే ఈ ఐదు రకాల నూనెలతో జరా జాగ్రత్త..!

షేర్ చేయండి:
Cooking Oils : వంటకు వాడే ఈ ఐదు రకాల నూనెలతో జరా జాగ్రత్త..!

సాక్షి లైఫ్ : మనం రోజూ ఇంట్లో వండుకునే ఆహారం ఆరోగ్యకరమైన దేనని భావిస్తుంటాం. కానీ, కూరల్లో వాడే నూనె విషయంలో చేసే చిన్న పొరపాటు ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాణిజ్యప్రకటనల్లో "ఆరోగ్యకరం" అని ప్రచారం చేసే అనేక నూనెలు వాస్తవానికి శరీరానికి హాని చేస్తాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. వంటగది నుంచి తక్షణమే తొలగించాల్సిన ఆ ఐదు రకాల నూనెలపై ప్రత్యేక కథనం.. 

 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?  

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?

ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?

 

1. పామాయిల్..

మార్కెట్లో లభించే బిస్కెట్లు, చిప్స్, నామ్ కీన్ వంటి ప్యాక్ చేసిన ఆహార పదార్థాల్లో దీనిని విరివిగా వాడతారు. ఇది చాలా చౌకగా లభించినప్పటికీ, ఇందులో ఉండే అధిక సంతృప్త కొవ్వులు ధమనుల్లో పేరుకుపోయి గుండె సంబంధిత సమస్యలకు కారణమవుతాయి.

2. వెజిటబుల్ ఆయిల్..

పేరుకు కూరగాయల నూనెలా అనిపించినా, ఇది నిజానికి అనేక రకాల చౌకబారు నూనెల మిశ్రమం. రసాయనాలు, అధిక ఉష్ణోగ్రతల వద్ద దీనిని శుద్ధి చేస్తారు. ఈ నూనె వాడకం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్  (Inflammation) ఏర్పడి దీర్ఘకాలిక వ్యాధులు సంభవిస్తాయి.

3. కార్న్ ఆయిల్..

మొక్కజొన్న ఆరోగ్యానికి మంచిదే కానీ, దాని నుంచి తీసే నూనె మాత్రం ప్రమాదకరమే. దీని తయారీలో సంక్లిష్ట రసాయన ప్రక్రియలు జరుగుతాయి. ఇందులో ఉండే అధిక ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్లు శరీరంలోని పోషక సమతుల్యతను దెబ్బతీస్తాయి.

4. సన్‌ఫ్లవర్ ఆయిల్..

తెలుగు రాష్ట్రాల్లోని మెజారిటీ ఇళ్లలో దీనినే వాడుతుంటారు. అయితే మార్కెట్లో దొరికే శుద్ధి చేసిన (Refined) సన్‌ఫ్లవర్ ఆయిల్ వేడి చేసినప్పుడు హానికరమైన సమ్మేళనాలను విడుదల చేస్తుంది. ఇది ఆరోగ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు.

5. రైస్ బ్రాన్ ఆయిల్..

గుండెకు మేలు చేస్తుందని మార్కెట్ చేస్తున్నప్పటికీ, తవుడు నుంచి నూనెను వేరు చేయడానికి 'హెక్సేన్' వంటి ప్రమాదకర రసాయనాలను ఉపయోగిస్తారు. ఈ శుద్ధి ప్రక్రియలో నూనెలోని సహజ గుణాలు నశించి, శరీరానికి హాని చేస్తాయి.

మేలైన ప్రత్యామ్నాయాలు ఇవే..

ఆధునిక శుద్ధి చేసిన నూనెల కంటే మన పాత, సాంప్రదాయ నూనెలే మేలని నిపుణులు సూచిస్తున్నారు.

గానుగ ఆవాల నూనె..  

స్వచ్ఛమైన దేశీ నెయ్యి..  

కోల్డ్-ప్రెస్డ్ (గానుగ) కొబ్బరి నూనె

వంటలో వీటిని వాడటం వల్ల రుచితో పాటు ఆరోగ్యం కూడా సిద్ధిస్తుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే....? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.