Bird Flu : 'బర్డ్ ఫ్లూ' కొత్త రూపంపై డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక..!
సాక్షి లైఫ్ : బర్డ్ ఫ్లూ (ఏవియన్ ఇన్ఫ్లుయెంజా)(H5N1) అనగానే సాధారణంగా కోళ్లు, ఇతర పక్షులకు సోకే వ్యాధిగానే మనం భావిస్తాం. కానీ ఇటీవలి కాలంలో ఈ వైరస్ పక్షులకే పరిమితం కాకుండా ఎలుకలు, పాడి పశువులతో పాటు మనుషులకు కూడా సోకుతుండటం వైద్య నిపుణులను, శాస్త్రవేత్తలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా అమెరికాలోని వాషింగ్టన్‌లో ముగ్గురికి H5N1 బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడం, అందులో ఒకరు మరణించడం కలకలం రేపుతోంది.
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
డబ్ల్యూహెచ్‌ఓ..
అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రం యాకిమా కౌంటీలోని డెయిరీ ఫామ్‌లలో పనిచేస్తున్న ముగ్గురు కార్మికులకు అక్టోబర్ 16 నుంచి నవంబర్ 4 మధ్య కాలంలో H5N1 వైరస్ సోకినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ధృవీకరించింది. వీరిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పాడి పశువుల ద్వారా వైరస్ సోకి మనిషి మరణించడం ఇదే మొదటిసారి అని నివేదికలు చెబుతున్నాయి.
అయితే, ప్రస్తుతానికి ఈ వైరస్ మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని, సాధారణ ప్రజలకు దీనివల్ల పెద్దగా ముప్పు లేదని డబ్ల్యూహెచ్‌ఓ స్పష్టం చేసింది. పశువులు, పక్షులతో నేరుగా పనిచేసే వారికి మాత్రమే 'తక్కువ నుంచి మధ్యస్థ' స్థాయిలో ముప్పు పొంచి ఉందని తెలిపింది.
లక్షణాలు ఎలా ఉంటాయి..?
మనుషులకు ఈ వైరస్ సోకినప్పుడు సాధారణ ఫ్లూ మాదిరిగానే లక్షణాలు కనిపిస్తాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఇది తీవ్రరూపం దాల్చి ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
కళ్లు ఎర్రబడటం లేదా వాపు,కండ్లకలక
జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి శ్వాసకోశ సమస్యలు
తీవ్రమైన న్యుమోనియా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
శాస్త్రవేత్తలు ఎందుకు ఆందోళన చెందుతున్నారు..?
ఇన్ఫ్లుయెంజా-ఏ రకానికి చెందిన ఈ H5N1 వైరస్ నిరంతరం తన రూపాన్ని మార్చుకునే (mutation) స్వభావం కలిగి ఉంటుంది. ఒకవేళ భవిష్యత్తులో ఇది మనిషి నుంచి మనిషికి సులభంగా వ్యాపించే సామర్థ్యాన్ని సంతరించుకుంటే, అది మరో పెను మహమ్మారికి దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎలాంటి వాళ్లు జాగ్రత్తగా ఉండాలి..?
పౌల్ట్రీ ఫామ్‌లలో పనిచేసేవారు, పాడి రైతులు, డెయిరీ కార్మికులు, పశువైద్యులు ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వ్యాధి సోకిన పక్షులు లేదా పశువుల మలం, లాలాజలం ద్వారా ఇది మనుషులకు వ్యాపిస్తుంది కాబట్టి, వాటికి దగ్గరగా వెళ్లేటప్పుడు తగిన రక్షణ కవచాలు మాస్కులు, గ్లౌజులు ధరించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
