మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

సాక్షి లైఫ్ : ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి, ఒక వ్యక్తికి మంచి అల్పాహారం మాత్రమే కాకుండా మంచి భోజనం, రాత్రి భోజనం కూడా అవసరం. కానీ ఈ రోజుల్లో బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారిలో రాత్రి భోజనం చేయని వారి సంఖ్య పెరుగుతోంది. భోజనం మానేస్తే తేలికగా బరువు తగ్గుతారని చాలామంది అపోహ పడుతుంటారు. కానీ వాస్తవంగా దీనికి సంబంధించిన ఫలితాలు పూర్తి భిన్నంగా ఉంటాయి. అవును, భోజనం మానేయడం వల్ల మీ బరువు తగ్గడానికి బదులు పెరుగుతారట. అందుకే ఉదయం అల్పాహారం ఎంత ముఖ్యమో, రాత్రి భోజనం కూడా అంతే ముఖ్యమని భావిస్తారు. 

ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?  

బరువు తగ్గడానికి, తినడం తగ్గించడం లేదా ఆపివేయడం అవసరం లేదు, కానీ ఏది తినాలి..? ఏది తినకూడదు..? అనేది తెలుసుకోవడం చాలా అవసరం. రాత్రి భోజనం చేయడానికి సరైన సమయం ఏది..? అంటే..? సమాధానం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈ ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

రాత్రి భోజనం చేయడానికి సరైన సమయం ఏది..?

సాధారణంగా ప్రతి వ్యక్తి తన దినచర్యకు అనుగుణంగా డైట్ ప్లాన్ చేసుకుంటాడు. అటువంటి పరిస్థితిలో ఈ ప్రశ్నకు సమాధానం ప్రతి వ్యక్తికి భిన్నంగా ఉండవచ్చు. అంతేకాదు ప్రతి వ్యక్తి వయస్సు, జీవనశైలి వంటి అంశాలు ఆ వ్యక్తి రోజు చివరి భోజనం ఎప్పుడు చేయాలో నిర్ణయిస్తాయి.

 భోజన నియమం..?

భోజన నియమం ప్రకారం.. ఒక వ్యక్తి ఉదయం నిద్రలేచిన రెండు గంటలలోపు లేదా ప్రతి మూడు నుంచి నాలుగు గంటలకు ఏదైనా తినమని సలహా ఇస్తారు. అయినప్పటికీ సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య వారి భోజనం పూర్తిచేయాలని  అనేక అధ్యయనాలు నొక్కి చెబుతున్నాయి. ఒకవేళ ఉద్యోగంలో భాగంగా అనుకూలించని షిఫ్టులలో ఉంటే, ఎసిడిటీ సమస్యను నివారించడానికి, నిద్రించడానికి కనీసం మూడు గంటల ముందు డిన్నర్ చేయాలని వైద్యనిపుణులు చెబుతున్నారు.

భోజనాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి..?

ఒక వ్యక్తి తన భోజనం ఎప్పుడు తీసుకోవాలి అనేది అతని పని, ఆకలి స్థాయి, మందులు, దినచర్య , రోజువారీ అలవాట్లపై ఆధారపడి ఉంటుంది.   మీరు మీ ఆహారంలో ఏమేం చేర్చుకోవాలనే దాని గురించి ఆలోచిస్తే తప్పనిసరిగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని చేర్చుకోవడం ముఖ్యం. 

డిన్నర్‌లో ఆరోగ్యకరమైన వస్తువులను చేర్చుకోవడం వల్ల మనిషికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇది మధుమేహం, బరువు నియంత్రించడం, మంచి నిద్ర పొందడం వరకు ఎంతగానో ప్రయోజన కరంగా ఉంటుంది.

రాత్రి భోజనం త్వరగా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. 

కొన్ని జీర్ణ , ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి త్వరగా రాత్రి భోజనం చేయడం చాలా ప్రధానం. ఇది కాకుండా మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తులు నిద్రవేళకు మూడు నుంచి నాలుగు గంటల ముందు ఆహారం తీసుకుంటే వారి మధుమేహం స్థాయిలు అదుపులో ఉంటాయి.  

ఇది కూడా చదవండి.. క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..? 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి.. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : mental-health depression mental-tensions stress late-night stress-food weight-loss protein-overweight stress-mind weight-lose night-food weight night-time over-weight weight-gain

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com