భవిష్యత్తులో వచ్చే క్యాన్సర్ల నుంచి రక్షణ.. తొమ్మిది ఏళ్లు పైబడిన పిల్లలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ తప్పనిసరి.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : పిల్లల ఆరోగ్య భద్రతలో టీకాలు కీలక పాత్ర పోషిస్తాయి. సాధారణంగా పుట్టినప్పటి నుంచి ఒక నిర్దిష్ట వయస్సు వరకు మాత్రమే టీకాలు వేస్తారనే అభిప్రాయం ఉంది. కానీ, ఆధునిక వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, తొమ్మిదేళ్లు దాటిన పిల్లలు కూడా కొన్ని ముఖ్యమైన టీకాలు తీసుకోవాలి. అందులో హ్యూమన్ పాపిల్లోమావైరస్ (హెచ్‌పీవీ) వ్యాక్సిన్ ఒకటి. ఈ టీకా కేవలం వైరస్ బారిన పడకుండా రక్షించడమే కాకుండా, భవిష్యత్తులో వచ్చే కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి కూడా కాపాడుతుందని వైద్యులు చెబుతున్నారు.

 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 

ఎందుకు తొమ్మిదేళ్ల నుంచే..?

తొమ్మిదేళ్ల వయస్సు నుంచే హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక రక్షణ లభిస్తుంది. ముఖ్యంగా యుక్తవయస్సులోకి రాకముందే ఈ టీకా వేయించుకోవడం వల్ల బలమైన, శాశ్వత రోగనిరోధక శక్తి ఏర్పడుతుంది. ఇది గర్భాశయ క్యాన్సర్, జననేంద్రియాలకు సంబంధించిన సమస్యలు, గొంతు క్యాన్సర్ల వంటి వాటి నుంచి అమ్మాయిలను,అబ్బాయిలను ఇద్దరినీ రక్షించడంలో సహాయపడుతుంది.

హ్యూమన్ పాపిల్లోమావైరస్ (హెచ్‌పీవీ) అంటే ఏమిటి..?

హ్యూమన్ పాపిల్లోమావైరస్ అనేది చర్మం నుంచి చర్మానికి సంపర్కం ద్వారా, ముఖ్యంగా లైంగిక కార్యకలాపాల ద్వారా వ్యాపించే ఒక సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్. చాలా ఇన్ఫెక్షన్లు వాటంతట అవే తగ్గిపోయినప్పటికీ, కొన్ని రకాల హెచ్‌పీవీ జాతులు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని నియోనాటాలజిస్ట్ హెచ్చరిస్తున్నారు. వీటిలో గర్భాశయ క్యాన్సర్, జననేంద్రియ సమస్యలు, అలాగే గొంతు, పాయువు, ప్రోస్టేట్ క్యాన్సర్లు కూడా ఉన్నాయి.

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.