బ్రెయిన్ ఈటింగ్ అమీబా సింటమ్స్ ను ఎలా గుర్తించాలి..? 

సాక్షి లైఫ్ : ఒక్కో వ్యాధి కి ఒక్కో లక్షణం ఉంటుంది. ఆయా లక్షణాలను బట్టి వ్యాధిని నిర్ధారిస్తారు. అదేవిధంగా కేరళను వణికిస్తున్న మెదడును తినే అమీబా వ్యాధికి కూడా కొన్ని రకాల లక్షణాలున్నాయి. వాటిని బట్టి ఆ జబ్బు ఉందో లేదో చెప్పవచ్చని చెబుతున్నారు వైద్యనిపుణులు. మెదడును తినే అమీబా వ్యాధి వ్యాధికారక శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఒకటి నుంచి తొమ్మిది రోజుల తర్వాత లక్షణాలు కనిపిస్తాయి. తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు, మెడ గట్టి పడడం, మానసిక స్థితిలో మార్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి చాలా త్వరగా తీవ్రమవుతుంది. ఆయా వ్యాధి లక్షణాలు ప్రారంభమైన 1-12 రోజులలోపు చనిపోయే ప్రమాదం ఉంది.

ఇది కూడా చదవండి.. క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..?

 

 ఇది కూడా చదవండి..హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విషయంలో అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు


అపరిశుభ్రమైన చెరువుల్లో..  

అపరిశుభ్రమైన చెరువుల్లో స్నానం చేయకూడదు. ఈత కొలనులను బాగా క్లోరినేషన్ చేయాలి. పిల్లలు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. కాబట్టి పిల్లలు చెరువుల్లోగానీ, ఇతర గుంటల్లో గానీ దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొలనులలో ఈత కొట్టేటప్పుడు స్విమ్మింగ్ నోస్ క్లిప్‌లను ఉపయోగించడం ద్వారా కూడా ఇన్ఫెక్షన్‌ను నివారించవచ్చు.  

అమీబా ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది కాబట్టి నీటిలో మునగకుండా ఉండాలి. ముక్కులో నీరు వెళ్లకుండా జాగ్రత్తపడాలి.  నీటిలోకి దూకినప్పుడు లేదా డైవ్ చేసినప్పుడు నీరు చాలా గట్టిగా  తాకినప్పుడు అమీబా మెదడులోకి ప్రవేశిస్తుంది. ఈ వ్యాధి పిల్లలు, యువకులలో ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఈ వయస్సు ఉన్నవారిని   కొలనులు మొదలైన వాటిలోకి దిగకుండా ఉండడం ఉత్తమం.

  ఇది కూడా చదవండి.. థైరాయిడ్ సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి..?

 ఇది కూడా చదవండి..  హెల్తీ డైట్: పిల్లల పెరుగుదలకు సహాయపడే ఆహారం..

 ఇది కూడా చదవండి.. కొలెస్ట్రాల్ అంటే ఏమిటి..? ఇది ఎన్ని రకాలు..?

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : brain-health brain-damage amoebic-encephalitis brain-eating-amoeba brain-eating-amoeba-symptoms primary-amoebic-meningo-encephalitis- amoebic-meningoencephalitis primary-amoebic-meningoencephalitis primary-amoebic-meningoencephalitis-(pam) amoeba brain-swelling indo-british-advanced-pain-clinic-founder-and-director love-hormones-in-the-brain

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com