షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా ఈ మామిడి పండ్లను ఆస్వాదించవచ్చు..!
సాక్షి లైఫ్ : మామిడి పండ్ల సీజన్ వచ్చిందంటే చాలు, ప్రతి ఒక్కరిలో ఒక ఆనందం. అయితే, డయాబెటిస్ (షుగర్) వ్యాధిగ్రస్తులకు మాత్రం ఇదో సవాల్. మామిడి పండ్లలో సహజ చక్కెరలు ఎక్కువగా ఉండటంతో, వాటిని తినడానికి సంకోచిస్తుంటారు. కానీ, శుభవార్త ఏమిటంటే, అన్ని మామిడి రకాలు షుగర్ వ్యాధిగ్రస్తులకు హానికరం కావు. కొన్ని ప్రత్యేక రకాలు డయాబెటిస్ ఉన్నవారు కూడా సురక్షితంగా ఆస్వాదించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
'టామీ అట్కిన్స్' – షుగర్ వ్యాధిగ్రస్తులకు స్వీట్ ట్రీట్.. !
తాజాగా జరిగిన ఒక మామిడి పండుగ ప్రదర్శనలో, షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా తినే మామిడి రకాలను ప్రత్యేకంగా ప్రదర్శించారు. అందులో ప్రముఖంగా నిలిచింది 'టామీ అట్కిన్స్' (Tommy Atkins) అనే అమెరికన్ మామిడి రకం. ఈ మామిడి పండును 'షుగర్-ఫ్రీ'గా పరిగణిస్తారు.
ఎందుకు 'టామీ అట్కిన్స్' ప్రత్యేకమైనది?
'టామీ అట్కిన్స్' మామిడిలో గ్లూకోజ్ స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. సాధారణంగా ఇతర మామిడి రకాలతో పోలిస్తే, ఇందులో చక్కెర శాతం గణనీయంగా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ, దీని రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. తీపిదనం, సువాసనలోనూ అద్భుతంగా ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు తమ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుందేమోనన్న భయం లేకుండా ఈ రకాన్ని తినవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఎలా ఆస్వాదించాలి?
అత్యంత తక్కువ గ్లూకోజ్ స్థాయి ఉన్నప్పటికీ, డయాబెటిస్ ఉన్నవారు ఏ రకం మామిడి పండును అయినా మితంగా తీసుకోవడం ముఖ్యం. 'టామీ అట్కిన్స్' వంటి రకాలను కూడా తగిన మోతాదులో, వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి. ముఖ్యంగా భోజనానికి ముందు లేదా తరువాత కాకుండా, అల్పాహారంగా లేదా భోజనానికి మధ్య తీసుకోవడం మంచిది.
ఆరోగ్య నిపుణులతో సంప్రదించి, మీ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా సరైన మామిడి రకాలను ఎంచుకోవడం, వాటిని ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకోవడం ఉత్తమం. ఈ మామిడి సీజన్‌లో షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా ఇష్టమైన పండ్లను ఆస్వాదించే అవకాశం ఉండటం నిజంగా శుభవార్తే.. మరి..!
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
