నులిపురుగుల మందు పిల్లలకు ఎందుకు వేస్తారు..?
సాక్షి లైఫ్ : సీజన్ మారుతున్నసమయంలో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అనేక వ్యాధులు వ్యాపిస్తుంటాయి. అలాంటి సమస్యలో తప్పనిసరిగా పిల్లలకు నులిపురుగుల మందు వేయాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. చిన్నారుల్లో పలు అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణం నులిపురుగులు. వీటిని నుంచి పిల్లలను రక్షించుకోవాలంటే ఆల్బెండజోల్ మాత్రలు వాడాలి.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
నులి పురుగులు పిల్లల పొట్టలోకి చేరి మెలిపెడుతూ వారి ఎదుగుదలను అడ్డుకొంటుంటాయి. దీని వల్ల రక్తహీనత, పోషకాహారలోపంతోపాటు పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. నులిపురుగుల నివారణకు ఏటా రెండు సార్లు ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలి.
ఆల్బెండజోల్ మాత్రలు..
ఆల్బెండజోల్ మాత్రలు అంగన్వాడీ కేంద్రాలు, స్కూళ్లు, జూనియర్, డిగ్రీ కళాశాలలకు తిరిగి వైద్య సిబ్బంది పంపిణీ చేస్తుంటారు. 1నుంచి19 ఏళ్ల వయసున్నవారికి నులిపురుగుల మాత్రలు వేసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు. సంవత్సరం నుంచి రెండు ఏళ్ల లోపు చిన్నారులకు ఆల్బెండజోల్ 400 ఎంజీ సగం మాత్ర, 3నుంచి19 ఏళ్లలోపు వారికి 400 ఎంజీ ఫుల్ టాబ్లట్ వేయాలని డాక్టర్లు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి.. ఇన్‌స్టంట్ నూడుల్స్ సైడ్ ఎఫెక్ట్స్..
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
